తెలుగు సినిమా చరిత్రలో జూలూరు జమున తెలుగు సినిమా నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. తెలుగు తన మాతృభాష కాకపోయినా కూడా ఆమె తెలుగు చలన చిత్రాలలో నటించి తెలుగు అమ్మాయిగా అరుదైన గుర్తింపు పొందింది. హంపీలో 1936వ సంవత్సరంలో జన్మించిన ఈమె చిన్నప్పటి నుంచి నాటకాల్లో నటిస్తూ సినిమాలపై ఆసక్తి చూపించేవారు. జమున తల్లికి సంగీతం పట్ల ఆసక్తి ఉండటంతో కూతురు శాస్త్రీయ సంగీతాన్ని హార్మోనియం లో శిక్షణ ఇప్పించారు.

ఆ విధంగా మా భూమి నాటకం లో ఒక పాత్ర పోషించింది జమున. అప్పుడు ఆమె అభినయానికి మెచ్చిన ఆమెకు పుట్టిల్లు అనే సినిమా దర్శకుడు ఆమెకు నటిగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతోనే సినిమాల్లోకి తెరంగేట్రం చేశారు జమున.  తెలుగు తమిళ భాషల్లో కలిపి మొత్తంగా 198 సినిమాలు చేసిన ఈమె కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించి అక్కడ తనదైన ముద్ర వేసుకున్నారు. 1967లో ఆమె తీసిన మిలన్ సినిమాకు గాను, మూగమనసులు సినిమా కి గానూ ఆమెకు ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు దక్కింది.

తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థను నెలకొల్పి ఆమె 25 సంవత్సరాలకు పైగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇప్పటికీ చేస్తున్నారు. రాజకీయం గా ఆమె ప్రజలకు విశేష సేవలు అందించారు. కాంగ్రెస్ పార్టీలో 1980 లో చేరి 1989లో రాజమండ్రి నియోజకవర్గం నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయాల నుంచి తప్పుకున్నా 1991 సంవత్సరం లో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేశారు. జులురి రమణ రావు ను 1965 లో వివాహం చేసుకుంది జమున. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్ గా పని చేయగా 2018 సంవత్సరంలో ఆయన గుండెపోటుతో మరణించారు.  వారి కుమారుడు వంశీకృష్ణ కూతురు స్రవంతి ఇద్దరు కూడా ప్రస్తుతం హైదరాబాద్ లో నివసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: