ప్రస్తుతం బయోపిక్స్ ఏ రేంజ్ లో నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే స్టార్ హీరోల నుంచి డైరెక్టర్ల వరకు అందరూ బయోపిక్స్ చేయడంపై బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా "సైరా నరసింహారెడ్డి" అనే బయోపిక్ ని తీశారు. అయితే ఇక ఆ సినిమా తర్వాత చిరంజీవి కి బయోపిక్ చేసే అవకాశం వచ్చిందని సమాచారం వినిపిస్తోంది.ఇకపోతే గజదొంగ టైగర్ నాగేశ్వరరావు పై రావాల్సిన బయోపిక్ కూడా ముందుగా చిరంజీవి వద్దకే వెళ్లిందట..

 కానీ చిరంజీవి ఆ సినిమాని చేయలేకపోయారట. ఇక దీంతో ఈ సినిమా మాస్ మహారాజా రవితేజ చేతిలోకి వెళ్ళింది."దొంగాట" మరియు "కిట్టు ఉన్నాడు జాగ్రత్త" ఫేమ్ వంశీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.అయితే  ఈ మధ్యనే ఈ సినిమాని దర్శకనిర్మాతలు గ్రాండ్ గా లాంచ్ కూడా చేశారు.ఇక మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాగా ఈ వేడుకలో మాట్లాడుతూ దర్శకుడు వంశీ ముందుగా ఈ కథతో చిరంజీవి నే సంప్రదించినట్లు తెలిపారు. అయితే కానీ ఇతర సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవిసినిమా చేయలేకపోవడంతో రవితేజ సంప్రదించగా...

రవితేజ ఒప్పుకున్నట్లు చెప్పారు.ఇక  అదే వేడుకలో మాట్లాడుతూ చిరంజీవి తాను చేయలేకపోయినా సినిమాని తన తమ్ముడు రవి తేజ చేయటం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే తాజాగా ఈయన నటించిన 'ఆచార్య' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 29 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెగాపవర్స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు. ఇక ప్రస్తుతం గాడ్ ఫాదర్,భోళా శంకర్, చిరు154, వెంకీ కుడుముల సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు మెగాస్టార్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: