కేజీఎఫ్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెంచుకున్నారు ఈ మూవీ హీరోయిన్ శ్రీ నిది సెట్టి. సినిమాలో తన పాత్ర కూడా చాలా కీలకం. డబ్బున్న గ్యాంగ్స్టర్ కూతురి పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులను అలరించారు శ్రీ నిది.
చాప్టర్ 1 లో ఫుల్ టెంపర్ ఉన్న అమ్మాయిగా కనిపించిన శ్రీ నిది కేజీఎఫ్ చాప్టర్ 2 లో హీరో గురించి నిజం తెలుసుకుని పూర్తిగా మారిపోయి మరొక యాంగిల్ లో అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేశారు. ముఖ్యంగా ఒక భార్యగా తాను తల్లి కాబోతున్నాను అని భర్తకు చెప్పడానికి, అమ్మ వస్తుంది అన్న మాట....ప్రేక్షకుల మదిలో అల్లుకుపోయింది. ఇక శ్రీ నిది రియల్ లైఫ్ విషయానికొస్తే... ఈమె సినిమాల్లోకి రాకముందు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. చదువుల్లో నంబర్వన్. ఈమెకు ఇద్దరు సిస్టర్స్ కూడా ఉన్నారు.

తన తల్లి మరణంతో కుంగి పోయిన శ్రీ నిది జాబ్ మానేసి ఇంట్లో కూర్చుంది. అయితే ఆ బాధ నుండి బయటకు రావడానికి తనకు నచ్చిన మోడలింగ్ వైపు వెళ్ళమని తండ్రి అలాగే తన అక్కలు ప్రోత్సహించడంతో అలా మోడలింగ్ మొదలు పెట్టారు. 2012 లో క్లీన్ యండ్ క్లియర్ ఫ్రెష్ నెస్ కాంటెస్ట్ లో పాల్గొని టాప్ 5 లో నిలిచారు శ్రీనిధి. మిస్ కర్ణాటక టైటిల్ ని కూడా సొంతం చేసుకున్నారు నిది. మోడలింగ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఈమె మోడలింగ్ లో నెలకు దగ్గర దగ్గర 15 లక్షల వరకు సంపాదించేవారు.

తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం శ్రీనిధి శెట్టికి టాలీవుడ్ లో ఒక మంచి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత తనయుడు అరంగ్రేటం చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధిని అనుకుంటున్నారట. ఇందులో కూడా కెజిఎఫ్ తరహా పాత్రనే డైరెక్టర్ డిజైన్ చేశారట. అలంటి పాత్రకు ఈమె అయితే సరిపోతుందని భావించి ఫైనల్ చేశారట. ఇక ఇప్పటికే తమిళ్ హీరో విక్రమ్ తో కోబ్రా మూవీలోనూ హీరోయిన్ గా చేశారు. ప్రస్తుతం తెలుగు, తమిళ్, కన్నడ సినిమాలలో వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయారు శ్రీనిధి.

మరింత సమాచారం తెలుసుకోండి: