టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ దర్శకులలో ఒకరైన వెంకీ అట్లూరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెంకీ అట్లూరి , వరుణ్ తేజ్ హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా తెరకెక్కిన తొలి ప్రేమ మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ ని మొదలు పెట్టాడు. 

మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరి ఆ తర్వాత అక్కినేని అఖిల్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన మిస్టర్ మజ్ను మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర అపజయం పాలయింది.  ఆ తరువాత ఈ దర్శకుడు నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా రంగదే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర యావరేజ్ గా మిగిలిపోయింది.  ఇలా ఇప్పటి వరకు తెలుగు హీరోలతో తెలుగు మూవీ లను తెరకెక్కిస్తూ వచ్చిన వెంకీ అట్లూరి ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నా ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న సార్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ధనుష్ సరసన సంయుక్త మీనన్  మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా ఈ సినిమా నుండి మూవీ యూనిట్ ధనుష్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది.  ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ధనుష్ ఒక చీకటి గదిలో లైట్ వెలుతురు మధ్య బుక్ పై ఏదో రాస్తున్న  ఫోటో ను విడుదల చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా టీజర్ ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు కూడా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: