స్టార్ హీరోలు నటించిన సినిమాల నుండి టీజర్ లు విడుదల అయ్యాయి అంటే ఆ హీరో అభిమానులు ఆనందానికి హద్దు ఉండదు. అలాగే ఆ టీజర్ లు కనుక ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకున్నట్లు అయితే మామూలు సినీ ప్రేమికుల్లో కూడా ఆ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోతాయి. అలా ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు నటించిన సినిమా టీజర్ లు కొన్ని విడుదల అయ్యాయి. అందులో కొన్ని టీజర్ లు తమ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులను కూడా అలరించాయి. అలా ఈ మధ్యకాలంలో విడుదల అయ్యి ప్రేక్షకులను అత్యంత అలరించిన టీజర్ లు ఏవో తెలుసుకుందాం.

నందమూరి నరసింహ బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లో 107 వ సినిమా కావడంతో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఎన్ బి కె 107 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. కొంతకాలం క్రితం ఈ మూవీ టీజర్ ని మూవీ యూనిట్ విడుదల చేయగా ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి అత్యంత ప్రజాదరణ దక్కింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ టీజర్ ను కొన్ని రోజుల క్రితమే మూవీ యూనిట్ విడుదల చేసింది.

మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ లభించింది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ది ఘోస్ట్ మూవీ టీజర్ ను కొంత కాలం క్రితమే చిత్ర బృందం విడుదల చేయగా ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన హరిహర వీరమల్లు మూవీ లోని ఒక చిన్న వీడియోను పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల చేయగా ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: