బుల్లితెర యాంకర్ సుమ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..ప్రోగ్రామ్‌ ఏదైనా సరే సుమ హోస్ట్‌గా ఉందంటే చాలు ప్రేక్షకుల్లో జోష్‌ నిండాల్సిందే.కేరళ నుంచి వచ్చి తెలుగులో స్టార్ యాంకర్ అయ్యింది.వరుస షోలు, ఈవెంట్ లతో ఫుల్ బిజిగా ఉంది.సుమ తో మూవీ లాంచ్ చేయడానికి సినీ నిర్మాతలు అనే డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.అంతలా సుమ పాపులర్ అయింది.. పలు టీవీ కార్యక్రమాలను కూడా చేస్తూ వస్తుంది.సోషల్ మీడియాలో కూడా సుమా ఎప్పుడూ చురుగ్గా వుంటుంది.



తనదైన చలాకీ తనం, మాటలతో ప్రేక్షకులకు ఆకట్టుకోవడంలో సుమది అందె వేసిన చేయి. ఇక ప్రేక్షకులకు ఆకట్టుకునే మరో యాంకర్‌ అనసూయ. అందం, ట్యాలెంట్‌ కలగలిపిన అతికొద్ది మందిలో అనసూయ ఒకరు. చిన్న న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ ప్రారంభించి టాప్‌ యాంకర్‌ స్థాయికి ఎదిగారు. ల్లో నటించే స్థాయికి ఎదిగిన అనసూయ ఎంతో మంది ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నారు.ఇలా వీరిద్దరూ టాలీవుడ్‌లో తమ ట్యాలెంట్‌తో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే ప్రోగ్రామ్‌లతో ఎంత బిజీగా ఉన్నా వీరిద్దరూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు. 



తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఇద్దరు ట్యాలెంటెట్ యాంకర్లు ఒక చోట చేరి డ్యాన్స్‌ చేశారు. సుమ, అనసూయ కలిసి ఏదో షూటింగ్‌ స్పాట్‌లో ఇంగ్లిష్‌ సాంగ్‌కు స్టెప్పులేశారు.. ఈ వీడియోను సుమ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా షేర్‌ చేసుకున్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇలా ఇద్దరు యాంకర్‌లు కలిసి డ్యాన్స్‌ చేయడంపై పట్ల నెటిజన్లు లైక్‌లను అందజేశారు..అనసూయ షో లతో పాటు ఇటు సినిమాలను కూడా చేస్తూ తీరిక లేని బిజీగా ఉంది.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియో పై మీరు ఓ లుక్ వేసుకోండి..ఓ కామెంటొ లైకు వేసుకోండి..



మరింత సమాచారం తెలుసుకోండి: