తమిళ సూపర్ హిట్ అయిన అసురన్ తెలుగు రిమేక్ సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ రిమేక్ లో సీనియర్ స్టార్ వెంకటేశ్ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను క్లాస్ మూవీస్ డైరెక్టర్ హ్యాండిల్ చేయబోతున్నట్టు వినిపిస్తోంది. ఫ్లాప్స్ తో ఛాన్స్ లు లేకుండా పోయిన సదరు దర్శకుడికి వెంకటేష్ పిలిచి మరీ బంపర్ ఆఫర్ ఇస్తున్నట్టు టాక్. 

 

రీసెంట్ గా ధనుష్ హీరోగా వెట్రీమారన్ దర్శకత్వంలో నటించిన అసురన్ మూవీ కోలీవుడ్ బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ గా నిలిచింది. కమర్షియల్ సక్సెస్ తో పాటు క్రిటిక్స్ మెప్పుపొందిన ఈ సినిమా టాలీవుడ్ మేకర్స్ సైతం ఫిదా అయిపోయారు. బడా ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు పోటీపడి మరీ అసురన్ రిమేక్ రైట్స్ దక్కించుకున్నాడు. వెంకటేశ్ హీరోగా రిమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నా... ఈ సినిమా డైరెక్టర్ పై ఓ ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. 


అసురన్ రీమేక్ కు సంబంధించి నిర్మాత సురేష్ బాబు ఇప్పటికే పలువురు దర్శకులతో చర్చలు జరిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రిమేక్ బాధ్యతలును దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు అప్పగించినట్టు తెలుస్తోంది. గతంలో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేశ్ వన్ ఆఫ్ ది హరోగా నటించిన విషయం తెలిసిందే. ఆ పరిచయంతోనే స్వయంగా వెంకటేశ్ శ్రీకాంత్ అడ్డాల పేరును రిఫర్ చేసినట్టు వినిపిస్తోంది. 


అసురన్ రిమేక్ హ్యాండిల్ చేసిన బాధ్యత శ్రీకాంత్ అడ్డాలకు దక్కితే గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. బ్రహ్మోత్సవం డిజాస్టర్ తో శ్రీకాంత్ అడ్డాలకు అవకాశాలు లేకుండా పోయాయి. గత మూడేళ్లుగా ఎంతమంది హీరోల చుట్టూ తిరిగిన ఈ దర్శకుడికి అవకాశం ఇవ్వడం లేదు. బ్రహ్మోత్సవం అట్టర్ ప్లాప్ ఈ దర్శకుడి కెరీర్ పై అంతగా ఎఫెక్ట్ చూపించింది. ఇలాంటి టైమ్ లో అసురన్ రిమేక్ డైరెక్టర్ గా శ్రీకాంత్ అడ్డాల పేరు వినిపిస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ సిినిమాలో వెంకటేశ్ కి జోడీగా శ్రియ, అనుష్క పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: