ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా, కేఎస్ రావికందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రూలర్ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల తో పాటు బాలయ్య ఫ్యాన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. బాలయ్య రెండు రకాల విభిన్న షేడ్స్ లో కనిపించనున్న ఈ సినిమాలో వేదిక, సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా భూమిక ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తోంది. గత ఏడాది బాలయ్య మరియు కేఎస్ రవికుమార్ ల కలయికలో వచ్చిన జైసింహాను మించేలా ఈ సినిమా ఉండనుంది సమాచారం. 

 

ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయి ఫ్యాన్స్ లో బాగా అంచనాలు క్రియేట్ చేసింది. కాగా నేడు వీక్షకుల ముందుకు వచ్చిన థియేట్రికల్ ట్రైలర్, సినిమాపై అంచనాలు మరింతగా పెంచింది అనే చెప్పాలి. ట్రైలర్ లో యాక్షన్, ఎమోషన్ సీన్స్ తో పాటు ఫైట్స్ కూడా ఎంతో అదిరిపోయాయి. ఇక ఎప్పటివలె బాలయ్య ఈ ట్రైలర్ లో అదిరిపోయే డైలాగ్స్ చెప్పారు. ఇక రెండు రకాల పాత్రల్లో కూడా బాలయ్య ఎంతో బాగా పెర్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాని పక్కా కమర్షియల్ సినిమాగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని, కేవలం బాలయ్య ఫ్యాన్స్ ని మాత్రమే కాక అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సినిమాను తెరకెక్కిస్తున్నారట. 

 

రేపు రిలీజ్ తరువాత సినిమా తప్పకుండా సక్సెస్ సాదిస్తుందని, ముఖ్యంగా యక్షన్ మరియు ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకు మంచి హైలైట్ అని సినిమాపై దర్శకుడు కేఎస్ రవికుమార్ ఎంతో నమ్మకంగా ఉన్నారట. అలానే ఇటీవల వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు రెండూ కూడా నందమూరి ఫ్యాన్స్ ని ఎంతో నిరాశపరచడంతో, తప్పకుండా ఈ సినిమాతో ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకోవడం ఖాయం అని దర్శకుడితో పాటు సినిమా యూనిట్ మొత్తం ఎంతో ధీమా వ్యక్తం చేస్తోందట. మరి ఈనెల 20వ తేదీన రిలీజ్ కానున్న రూలర్ ఎంతమేరకు బాలయ్యకు సక్సెస్ ని అందిస్తుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: