రీసెంట్ గా మహేష్ బాబు సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నటిస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయినా సంగతి అందరికీ తెలిసిందే. సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలో రేణు దేశాయ్ నటిస్తున్నట్లు వచ్చిన వార్తల యొక్క సారాంశం. తాజాగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటు అభిమానులతో అనేక విషయాలు పంచుకునే రేణు దేశాయ్ కి వచ్చిన ఈ వార్త గురించి చాలామంది అభిమానులు పోస్టులు పెట్టారు. అభినందనలు ప్రశంసలు చాలామంది తెలియజేస్తూ గ్రాండ్ రీ ఎంట్రీ వెల్కమ్ అంటూ ఆమెకు పోస్టుల ద్వారా స్వాగతం పలికారు.

 

కాగా తనపై వచ్చిన వార్తలు గురించి పూర్తి క్లారిటీ ఇచ్చారు రేణుదేశాయ్. అసలు ఇలాంటి వార్తలు తెరపైకి తెచ్చిన వారికి చెబుతున్నాను అంటూ వాస్తవానికి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి తనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం వస్తే నేనే ప్రకటించే దాన్ని నాకు కూడా నటించాలని ఉంది, గతంలో తల్లి పాత్రల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు హీరోల చిన్నప్పటి పాత్రలకు తల్లిగా చేసేందుకు అంగీకారం తెలిపాను అని కానీ ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా అనేది కేవలం రూమర్స్ తప్ప వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది.

 

ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ ఈ విషయాలు చెప్పుకొచ్చింది. ఇది ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో బంధువులు అండగా ఉంటే ఏదో రెండు మూడు సినిమాలు ప్రేక్షకులు చూస్తారు అంతేగాని టాలెంట్ లేకపోతే ఆ నటుడిని పక్కన పెట్టేస్తారు అంటూ ‘నెపోటిజం’ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ విధంగా రేణు స్పందించింది. దీంతో రేణు సినిమాల్లోకి వస్తుందనే ఆశతో ఉన్న అభిమానులు ఒక్కసారిగా ఆమె ఇచ్చిన క్లారిటీకి నిరుత్సాహం చెందుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: