ప్రస్తుతం కెరీర్ పరంగా మరొక టాలీవుడ్ హీరో అందుకోలేంత స్పీడ్ గా వరుసపెట్టి సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు డార్లింగ్ బాహుబలి ప్రభాస్. రాజమౌళి తీసిన బాహుబలి సినిమాల భారీ సక్సెస్ ల ద్వారా హీరోగా ఎంతో గొప్ప క్రేజ్, మార్కెట్ తెచ్చుకున్న ప్రభాస్, ఆ తరువాత చేసిన సినిమా సాహో కూడా పాన్ ఇండియా మూవీ గానే విడుదలైన విషయం తెల్సిందే. అయితే ఆ తరువాత ఏకంగా మొత్తం నాలుగు భారీ పాన్ ఇండియా సినిమాలు లైన్లో పెట్టిన ప్రభాస్, ఇటీవల వాటిలో పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ తీస్తున్న రాధేశ్యామ్ ని కంప్లీట్ చేసారు.

యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మరొకవైపు ప్రభాస్ చేస్తున్న సలార్, ఆదిపురుష్, ప్రాజక్ట్ కె సినిమాలు వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. కాగా సలార్ ని ప్రశాంత్ నీల్ ఎంతో భారీ స్థాయిలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని హోంబలె ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక మైథలాజికల్ సినిమా ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా కృతి సనన్ సీత పాత్ర చేస్తున్నారు. ఓం రౌత్ తీస్తున్న ఈ సినిమాని టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇక ప్రాజక్ట్ కె మూవీ ని నాగ అశ్విన్ తీస్తుండగా ఇందులో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే ఈ మూవీస్ అనంతరం త్వరలో సిద్దార్థ ఆనంద్ తో ఒక భారీ బాలీవుడ్ మూవీ తో పాటు మరొక్కసారి ప్రశాంత్ నీల్ కూడా వర్క్ చేయనున్నారట ప్రభాస్. కాగా ప్రశాంత్ నీల్ మూవీని భారీ చిత్రాల టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మించనుండగా ఇటీవల మూవీ కి సంబందించి స్క్రిప్ట్ వర్క్ ని ప్రశాంత్ మొదలెట్టారని, త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ప్రకటన రానుందని అంటున్నారు. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే ఏకంగా రెండు సార్లు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ పని చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: