సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే సమయంలో హీరోలు మరియు హీరోయిన్లు దర్శకనిర్మాతలకు కొన్ని షరతులు పెడతారనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత చైతన్య విడిపోవడం గురించి సోషల్ మీడియా వేదికగా ఎంతో రచ్చ జరుగుతోందని అందరికి తెలుసు.విడాకుల ప్రకటనకు కొన్ని రోజుల ముందు అలాగే కొన్ని రోజుల తర్వాత సమంత సినిమాలకు దూరంగా ఉన్నారనే విషయం అందరికి తెలిసిందే.


రెండు ప్రముఖ బ్యానర్లలో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత త్వరలోనే ఈ రెండు సినిమాల షూటింగ్ లలో పాల్గొననున్నారని తెలుస్తుంది.అయితే సమంత నిర్మాతలకు షాకింగ్ షరతులు పెట్టారని సమాచారం. విడాకుల ప్రకటన తర్వాత సమంత బయట ఎక్కడా కనిపించడం లేదని తెలుస్తుంది. సమంత ఇకపై తన సినిమాల షూటింగ్ ఎక్కువగా చెన్నైలోనే జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని వార్త వినిపిస్తుంది.


హైదరాబాద్ లో అయితే పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో తాను షూటింగ్ లో పాల్గొననని సమంత తేల్చి చెప్పినట్టు సమాచారం.


నిర్మాతలు సమంత షరతుల విషయంలో ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.అయితే సమంత అభిమానులు మాత్రం సమంత ప్రస్తుత పరిస్థితిని బట్టి ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారని తెలుస్తుంది.. అయితే అదే సమయంలో సమంత కండీషన్లు కొందరు ఫ్యాన్స్ ను తెగ టెన్షన్ పెడుతున్నాయని సమాచారం.. ఈ షరతుల వల్ల సమంతకు మరియు టాలీవుడ్ కు మధ్య దూరం పెరిగే ఛాన్స్ అయితే ఉందని చాలామంది భావిస్తున్నారని తెలుస్తుంది.. హైదరాబాద్ లో ఇండోర్ లొకేషన్లలో షూట్ సాధ్యం కాకపోతే సెట్స్ వేయాలని సమంత నిర్మాతలకు సూచనలు చేసినట్టు తెలుస్తుంది.. సమంత షరతుల వల్ల ఆమె కొన్ని మంచి సినిమాలను మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.. విడాకుల ప్రకటన వల్ల సమంత కెరీర్ కు ఇబ్బందులు తప్పవనే కామెంట్లు వినిపిస్తున్నాయని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: