అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్, అభిజిత్ హీరోగా తెరకెక్కిన మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది,  కాకపోతే ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపక పోవడంతో ఈ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు పెద్దగా అవకాశాలు కూడా  దక్కలేదు,  అయితే ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన కంచె సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించడంతో ప్రగ్యా జైస్వాల్ కు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా నక్షత్రం, జయ జానకి నాయక వంటి సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.

  ఇదిలా ఉంటే తాజాగా నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ  సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా అఖండ సినిమా తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో కలిసి ఓ మ్యూజిక్ ఆల్బమ్‌ కోసం ఓ సాంగ్ లో ప్రగ్యా జైస్వాల్ నటించింది, ఈ సాంగ్ ను గురు రాంధ్వా, సల్మాన్ ఖాన్ ప్రేయసి లులియా వాంటూర్ పాడారు. మై ఛలా విత్ సల్మాన్ ఖాన్ అనే సాంగ్ లో నర్తించింది, ఈ సాంగ్ జనవరి 22వ తేదీన విడుదల కానుంది. ఇలా నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ సినిమా తర్వాత ప్రగ్యా జైస్వాల్ బాలీవుడ్ లో అదిరిపోయే ఆఫర్ ను దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: