దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కోసం చాలా సంవత్సరాలు కేటాయించిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం  అలాంటి గ్యాప్ రావడానికి ఇష్టపడేలా కనిపించడం లేదు.  నిన్న అనగా మే 19 వ తేదీన సాయంత్రం ఎన్టీఆర్,  కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది.  తాజాగా ఈ రోజు మే 20 వ తేదీ న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్,  ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. 

జూనియర్ ఎన్టీఆర్,  ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా జూనియర్ ఎన్టీఆర్ కు కెరియర్ పరంగా 31 వ సినిమా.  తాజాగా జూనియర్ ఎన్టీఆర్ 31 వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.  ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఎన్టీఆర్ గుబురు గడ్డంతో,  కొర మీసాలతో,  గంభీరంగా చూస్తున్న ఒక పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ విడుదల అయిన నిమిషా ల్లోనే సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ 31 వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఎన్టీఆర్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు.

సినిమా షూటింగ్ ఏప్రిల్ 2023 నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాను మైత్రి మూవీ మేకర్స్,  నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ లు కలిసి సంయుక్తంగా నిర్మించబోతున్నారు.  ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్,  ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు.  ఆ సినిమా పనులు పూర్తి అవగానే ఎన్టీఆర్ తో సినిమాను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: