టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయినా ఆది సాయి కుమార్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  సాయి కుమార్ కుమారుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆది సాయి కుమార్ ఆ తర్వాత తను నటించిన సినిమాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమ కావాలి, సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆది సాయి కుమార్, ఆ వెంటనే లవ్లీ సినిమాతో మంచి  విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు.

ప్రేమ కావాలి , లవ్లీ మూవీ లో విజయాలతో ఆది సాయి కుమార్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు.  ప్రేమ కావాలి, లవ్లీ సినిమా లతో మంచి విజయాలను అందుకున్న ఆది సాయి కుమార్ ఆ తర్వాత మాత్రం ఆ రేంజ్ విజయాలను బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు అందుకోలేదు. వరుస పెట్టి సినిమా లలో నటిస్తున్నప్పటికీ ఆది సాయి కుమార్ కు మాత్రం ఆ సినిమాలు  నిరాశనే మిగిలిస్తూ వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సారి ఎలాగైనా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని తిరిగి ఫుల్ ఫామ్ లోకి రావాలని ఉద్దేశంతో ఆది సాయి కుమార్ 'బ్లాక్' అనే మూవీ లో హీరోగా నటించాడు.  

జి. బి కృష్ణా తెరకెక్కించిన ఈ మూవీ ని మహంకాళి దివాకర్ నిర్మించారు. బ్లాక్ సినిమా  మే 28 వ తేదీన విడుదల కాబోతుంది.  ఈ నేపథ్యంలో నటుడు సాయి కుమార్మూవీ ట్రైలర్ ను తాజాగా విడుదల చేశాడు.  బ్లాక్ మూవీ త్రిల్లింగ్ గా ఉంటుంది అని పేర్కొన్నాడు.  ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన దర్శన బానిక్ హీరోయిన్ గా నటించింది. మరి ఆది సాయి కుమార్ 'బ్లాక్' మూవీ తో తిరిగి ఎలాంటి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: