టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విక్టరీ వెంకటేష్ తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటికీ మోస్ట్ క్రేజీ హీరోలతో ఒకరిగా కొనసాగుతున్నాడు.  కేవలం విజయాలను అందుకోవడం మాత్రమే కాకుండా విక్టరీ వెంకటేష్ తనదైన నటనతో తనకంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.

ఇలా తనకంటూ ఒక ఇమేజ్ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రియేట్ చేసుకున్న విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన నారప్ప , దృశ్యం 2  రెండు సినిమాలు కూడా థియేటర్ లలో కాకుండా నేరుగా 'ఓ టి టి' లో విడుదలయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా వెంకటేష్ నటించిన ఎఫ్ 3 సినిమా  థియేటర్ లలో విడుదల కాబోతుంది. మే 27 వ తేదీన ఎఫ్ 3 మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో తాజాగా వెంకటేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

విక్టరీ వెంకటేష్ రాజా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ... నేను నిర్మాత వైపు ఆలోచిస్తా, సెట్ లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఏది వృధా జరిగిన ఒప్పుకోను. అలాగే తాజా ఇంటర్వ్యూ లో  భాగంగా వెంకటేష్ పాన్ ఇండియా మూవీ ల గురించి మాట్లాడుతూ... పాన్ ఇండియా గురించి పెద్దగా ఆలోచించలేదు, కాకపోతే సరైన టీమ్  దొరికినట్లు అయితే కచ్చితంగా చేస్తాను విక్టరీ వెంకటేష్ తాజా ఇంటర్వ్యూ లో  చెప్పుకొచ్చాడు. మరి ఎఫ్ 3 మూవీ తో వెంకటేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుండో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: