ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు వేణు తొట్టెంపూడి. ఎన్నో కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలలో నటించి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు అని చెప్పాలి. హీరోగా అవకాశాలు రాకపోవడంతో ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవతారమెత్తాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఇక వ్యాపారం పైన దృష్టి పెట్టాడు. అయితే దాదాపు ఆరు నెలల గ్యాప్ తర్వాత రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో కీలక పాత్రలో నటించాడు.


 ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు వేణు తొట్టెంపూడి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాతో ప్రతి ఒక్కరు కూడా వేణు తొట్టెంపూడి మళ్లీ ఫామ్ లోకి వస్తాడు అని భావించారు. కానీ అందరి అంచనాలు తారుమారు అయ్యాయి. రామారావు ఆన్ డ్యూటీ సినిమా ప్రమోషన్ సమయంలో వేణు తొట్టెంపూడి పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతను చేసిన వ్యాఖ్యలు కొన్ని సోషల్ మీడియాలో ఇప్పటికే హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి.


 ఈ క్రమంలోనే వేణు తొట్టెంపూడి జగపతిబాబు గురించి చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న జగపతి బాబు ఇక ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ విలన్ గా నటిస్తూ  దూసుకుపోతున్నాడు. వేణు తొట్టెంపూడి తో కలిసి హనుమాన్ జంక్షన్ ఖుషి ఖుషి గా సినిమాలో నటించాడు జగపతిబాబు. అయితే జగపతి బాబు  తన  హామీతో ఇతరులకు 14 లక్షల వరకూ నా దగ్గర నుంచి అప్పుగా ఇప్పించాడని కానీ అలా తీసుకున్న వ్యక్తులు మళ్ళీ తిరిగి చెల్లించకుండా మోసం చేశారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా జగపతిబాబు ని నమ్మి 14 లక్షలు అప్పుగా ఇచ్చి ఎంతగానో నష్టపోయాను అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: