టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన ఈ నగరానికి ఏమైం ది సినిమా తో మంచి విజయాన్ని , మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . ఆ తర్వాత ఈయన చాలా సినిమాలలో హీరోగా నటించా డు . అలాగే కొన్ని సినిమాల్లో హీరో గా నటించ డం మాత్రమే కాకుండా ఆ సినిమాలకు దర్శకత్వం కూడా వహిం చాడు . ఇక ఈయన నటించిన సినిమాలలో కొన్ని సినిమా లు మంచి విజయాలను కూడా అందుకున్నాయి . అలాగే ఈయన నటించి , దర్శకత్వం వహించిన సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడం తో ఈయన తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా , దర్శకుడిగా మంచి గుర్తింపు ఏర్పడింది.

కెరియర్ ప్రారంభించిన తర్వాత వరుసగా చాలా సినిమాలతో మంచి విజయాలను అందుకున్న విశ్వక్ ఈ మధ్య కాలంలో మాత్రం వరుస పెట్టి అపజయాలను అందుకుంటూ వస్తున్నాడు. ఆఖరుగా ఈయన నటించిన మెకానిక్ రాఖీ , లైలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను ఎదురుకున్నాయి. తాజాగా విశ్వక్ నెక్స్ట్ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. విశ్వక్ నెక్స్ట్ కల్ట్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఇకపోతే ఈ సినిమాలో విశ్వక్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి రచన మరియు దర్శకుడిగా కూడా వ్యవహరించబోతున్నాడు. ఇక తరుణ్ భాస్కర్ ఈ సినిమాలకు డైలాగ్స్ రాయనుండగా ... రవి బశ్రుర్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఈ మూవీ ని తెలుగు , హిందీ , జపనీస్ , స్పానిష్ , ఇంగ్లీష్ భాషలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs