
టాలీవుడ్ పెద్దదిక్కు అభిమానాన్ని , సహకారాన్ని దూరం చేసుకుంది. తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని చూస్తుంటే ఆ ఇండస్ట్రీ పెద్దలు మాత్రం కనీస మర్యాద , కృతజ్ఞత చూపించని పరిస్థితి నెలకొంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనంతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఏడాది అవుతుంది. ఇప్పటివరకు తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒక్కసారి కూడా మర్యాదపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవలేదని పవన్ కళ్యాణ్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఒక మీడియాను పంపించారు. ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితి కూర్చున్న చెట్టుని నరుకున్న చందంగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగడంతో ఇప్పుడు టాలీవుడ్ లెక్కలు పక్కాగా మారిపోనన్నాయి. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఆ నలుగురు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది.
థియేటర్ల విషయంలోనూ సినిమాల పంపిణీ విషయంలోనూ సినిమాలకు రేట్లు కేటాయించే విషయంలోనూ అటు థియేటర్లకు అద్దె ఇచ్చే విషయంలోనూ పర్సంటేజ్ ఇచ్చే విషయంలను వారు చెప్పిందే నడుస్తోంది. అసలు వారికి అడ్డుకట్ట వేసేనాథుడే లేకపోవడంతో సినిమా రంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని శాసించాలని చూస్తున్నారు. అసలు గత మూడు నాలుగు ఏళ్ల వరకు చిన్న సినిమాలను ఆ నలుగురు కలిసి ఎలా చంపేసేవారు ? చెప్పక్కర్లేదు. ఆ నలుగురిని ఢీ కొట్టి మరొకరు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి వచ్చిన ఏదోలా అణగదొక్కేవారు. ఉదాహరణకు వరంగల్ శీను పరిస్థితి ఎలా తారుమారు అయిందో చూసాం.
చివరకు వీరి అహంభావం ఏ స్థాయికి వెళ్లిందంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాను సైతం రిలీజ్ కాకుండా ఇబ్బందులు పెట్టేవరకు వెళ్లిపోయింది. దీనిని బట్టి వీరు ఏ స్థాయిలో చిన్న సినిమాలను టాలీవుడ్ను ఇప్పటివరకు శాసిస్తూ వచ్చారో క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సినిమాను టచ్ చేశారో ఇక ఇప్పటినుంచి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో ఆ నలుగురికి చుక్కలు కనపడతాయని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. పైగా పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో ఉన్న కుట్ర దారులకు రిటర్న్ గిఫ్ట్ రెడీ చేస్తానని ఓపెన్ గా ప్రకటించడంతో ఇప్పుడు వాళ్లకు ముసళ్ళ పండుగ ముందు ఉందని సంకేతాలు వచ్చినట్లయింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు