
టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీ వారసుడు .. మంచు విష్ణు హీరోగా ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా పాన్ ఇండియా స్టార్ , టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇంకా అక్షయ్ కుమార్ , మోహన్ లాల్ , కాజల్ అగర్వాల్ లాంటి బడా స్టార్స్ కాంబినేషన్ లో బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన డివోషనల్ హిట్ సినిమా కన్నప్ప. దాదాపు రు . 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రెండు రోజుల్ల వరల్డ్ వైడ్ గా రు. 42 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి.
ఇక కన్నప్ప థియేటర్ల లోకి వచ్చి ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యింది. ఇక సోమవారం నుంచి కన్నప్ప కు అసలు సిసలు పరీక్షల మొదలు కానుంది. హాలీడేస్ అయిపోయాయి. ఇక వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వడంతో కన్నప్ప కు సోమవారం నుంచి థియేటర్ల దగ్గర ఎలాంటి రెస్సాన్స్ లభిస్తుంన్న దాని మీదే బేస్ అయ్యి ఉంటుంది. సోమవారం నుంచి కూడా ఈ సినిమా మంచి వసూళ్లు వస్తేనే భారీ టార్గెట్ రీచ్ అవుతుంది. మండే టెస్ట్ లో కన్నప్ప పాస్ అయితే ఈ సినిమా భారీ విజయం సాధించినట్టే అనుకోవాలి. కన్నప్ప సినిమాకు స్టీపెన్ డేవస్సీ సంగీతం అందించగా మోహన్ బాబు నిర్మాణ సారథ్యం వహించారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు