- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి తన తాజా ఇంటర్వ్యూలో ఇండస్ట్రీ గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలిపారు. సినీ జనాలకు నిర్మాత శిరీష్ రెడ్డి పరిచయం తప్ప బయట జనాలకు కాదు ..! దిల్ రాజు సోదరుడుగా ఇప్పటివరకు తెరవెనకే ఉండిపోయారు. అలాంటి శిరీష్ రెడ్డి తొలిసారిగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో విషయాలతో పాటు చాలా విషయాల మీద మాట్లాడారు. మైత్రి మూవీస్ గురించి , నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను , సితార సంస్థ నాగ వంశీ గురించి చాలా విషయాలు చెప్పారు. అలాగే పర్సంటేజ్ సిస్టం ఎందుకు ?అవసరం .. తమ థియేటర్ల వ్యాపారం ఏమిటి అన్నది కూడా చెప్పారు. తాము గత్యంతరం లేక థియేటర్ వ్యాపారం లోకి వచ్చామని కూడా శిరీష్ రెడ్డి తెలిపారు.


త‌మ‌ వ్యాపారాన్ని నిలబెట్టుకోవడం కోసం కఠినంగా వ్యవహరించక‌ తప్పదన్నారు. యుద్ధంలోకి దిగిన తర్వాత చంపనైనా చంపాలి లేదా చావనైనా చావాలి అని క‌ఠిన‌ వ్యాఖ్యలు చేశారు. దిల్ రాజు ఏ సమస్యను అయినా కూల్ గా డీల్ చేస్తారని .. కానీ తన పద్ధతి అదికాదని ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడడమే తనకు వచ్చ‌ని శిరీష్ రెడ్డి తెలిపారు. హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని చెప్పటం సరికాదన్నారు. గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్ అయ్యాక దర్శకుడు కానీ , హీరో నుంచి కానీ కనీసం ఫోన్ రాలేదని శిరీష్ రెడ్డి అన్నారు. ఇక అనిల్ రావిపూడి లేకపోతే ఈరోజు తమ సంస్థ ఉండేదే కాదని శిరీష్‌ రెడ్డి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: