చాలా సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లయితే తెలుగు సినీ పరిశ్రమలో అనేక మల్టీ స్టారర్ మూవీస్ వస్తూ ఉండేవి. నందమూరి తారక రామారావు , అక్కినేని నాగేశ్వరరావు , కృష్ణ , శోభన్ బాబు లాంటి అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో చాలా మంది కలిసి అనేక సినిమాలలో నటించారు. కానీ ఆ తర్వాత జనరేషన్ హీరోలు మల్టీ స్టారర్ మూవీలలో పెద్దగా నటించలేదు. చాలా కాలం తర్వాత విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మల్టీ స్టారర్ మూవీ లో నటించారు. మళ్ళీ అప్పటి నుండి తెలుగు లో మల్టీ స్టారర్ మూవీల జోరు పెరిగింది. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలు అయినటువంటి నాగార్జున , జూనియర్ ఎన్టీఆర్ కాంబో లో కూడా ఓ మల్టీ స్టారర్ మూవీ మిస్ అయినట్టు తెలుస్తుంది.

అసలు విషయం లోకి వెళితే ... నాగార్జున కొన్ని సంవత్సరాల క్రితం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఊపిరి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కార్తీ కూడా హీరో గా నటించాడు. ఈ సినిమాలో మొదట కార్తీ పాత్రకు ఈ సినిమా దర్శకుడు అయినటువంటి వంశీ పైడిపల్లి , తారక్ ను అనుకున్నాడట. అందులో భాగంగా తారక్ ను కలిసి కథను కూడా వివరించాడట. కథ మొత్తం విన్న తారక్ స్టోరీ సూపర్ గా ఉంది. కానీ ఆ పాత్ర నాకు సెట్ కాదు అని చెప్పాడట. దానితో వంశీ పైడిపల్లి అదే స్టోరీని కార్తీ కి వినిపించగా ఆయన ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా నాగ్ , తారక్ కాంబోలో ఊపిరి సినిమా మిస్ అయినట్టు తెలుస్తుంది. ఇకపోతే ఊపిరి సినిమా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: