
వేదాంత్ సాధించిన పతకాల జాబితా చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే:
మలేషియా ఓపెన్ – 5 బంగారు పతకాలు
డానిష్ ఓపెన్ – బంగారం, వెండి
లాట్వియా ఓపెన్ – కాంస్యం
థాయిలాండ్ ఓపెన్ – కాంస్యం
ఒక సినిమా హీరో కుమారుడు సినిమాల వైపు మొగ్గుచూపకుండా, దేశ జెండాను అంతర్జాతీయ స్థాయిలో ఎగురవేసే ప్రయత్నం చేయడం నిజంగా గర్వకారణం. తాజా ఇంటర్వ్యూలో మాధవన్ ఏమంటాడంటే – “నా నటనతో అభిమానులు సంతోషపడినా, మా ఇంట్లో నిజమైన క్రమశిక్షణ వేదాంత్‌దే . ప్రతి రోజు ఉదయం 4 గంటలకు లేచి , రాత్రి 8 గంటలకు పడుకుంటాడు . ఆటగాడిగా ఉండేందుకు ఎంతటి కష్టపడా లో తెలిసినవాడవాడే విజేత అవుతాడు.” వేదాంత్ ఆహారం , నిద్ర, ప్రాక్టీస్ – అన్నింటిలో నూ నిర్దిష్టమైన డిసిప్లిన్ పాటిస్తాడు . ఈత అంటే కేవలం స్పోర్ట్ కాదు – ఇది అతని జీవిత విధానం .
వేదాంత్ మాధవన్ ప్రస్తుతం తన దృష్టంతా ఒలింపిక్స్ పైనే . భారత్ తరపున పతకం గెలిచే దిశగా అడుగులు వేస్తున్న ఈ యువతడి ని చూసి ప్రజలు, సెలబ్రిటీలు , ఫాన్స్ అంతా స్ఫూర్తిగా భావిస్తున్నారు. మాధవన్ మాట్లాడుతూ - “వేదాంత్ ప్రాక్టీస్ మామూలు గా ఉండదు. ఉదయం బ్రహ్మ ముహూర్తం నుంచే శ్రమ మొదలవుతుంది. అతనిని చూసి నేనూ క్రమశిక్షణ నేర్చుకోవాలని అనిపిస్తుంది.” తన తండ్రి లాంటి స్టార్‌గా మారాలనే ఆలోచనకు బదులుగా, వేదాంత్ తనకిష్టమైన దారిని ఎంచుకుని, నిష్టతో ముందుకెళ్తున్నాడు. ఇది నేటి జనరేషన్‌కి గొప్ప సందేశం. పేరున్న కుటుంబం నుంచి వచ్చినా, తన చెమటతో పేరుతెచ్చుకోవడమే అసలైన గర్వకారణం.
