సాధారణంగా స్టార్ సెలబ్రిటీస్ ఇళ్లల్లో ఎంత టైట్ షెడ్యూల్స్ ఉంటాయి అనేది అందరికీ తెలిసిందే . అసలు భార్యాభర్తతో మాట్లాడడానికి కూడా టైం ఉండదు.  బిజీబిజీ షెడ్యూల్ .. బిజీ బిజీ కాల్ షీట్స్ ..ఇలా ముందుకు పోతూ ఉంటారు . ఇక ఒక ఫ్యామిలీలో ఒక హీరో ఉంటేనే పరిస్థితి ఇలా ఉంటే.. ఒక ఫ్యామిలీలో 10 - 12 మంది హీరోలు ఉంటే . అసలు చెప్పనవసరం లేదు . ఆ ఇళ్ళంతా బిజీబిజీగా గడిపేస్తూ ఉంటారు.  బిజీ బిజీగా కనిపిస్తూ ఉంటుంది . అయితే చిరంజీవి మాత్రం అలా బిజీ షెడ్యూల్స్ లో కూడా ఫ్యామిలీ అంతా కలిసి టైం స్పెండ్ చేసేలా ఒక పక్క రూల్ తీసుకువచ్చారు.
 

హీరో అయినా సరే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే.. ఎన్ని కమిట్మెంట్లు ఉన్నా సరే ..కనీసం నెలకు ఒక్కసారైనా ..ఒక్క సండే అయినా సరే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి కూర్చొని టైమ్ స్పెండ్ చేయాలి . మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ దూరంగా పెట్టేయాలి.  కేవలం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మనసుకు ప్రశాంతంగా ఉండే మాటలనే మాట్లాడుకోవాలి అంటూ ఒక రూల్ ని తీసుకొచ్చారట . ఈ రూల్ ని ఎప్పటినుంచో మెగా ఫ్యామిలీ పాటిస్తూనే వస్తుంది . దీంతో చిరంజీవి చేసిన పని చాలా బాగుంది అంటున్నారు జనాలు .



అంతేకాదు ఈ మధ్యకాలంలో టెక్నాలజీ పెరిగిపోవడంతో భార్య భర్తలు కూడా టైం స్పెండ్ చేయాలనే అంత బిజీ అయిపోతుంది. సరదాగా కాసేపు కూర్చున్న చేతిలో మొబైల్ ఫోన్లో పట్టుకొని ఏదో ఒక రీల్స్ , షాట్స్ చూస్తున్నారు . మనసు విప్పి మాట్లాడుకోవడమే మానేస్తున్నారు . తద్వారా బంధుత్వాలు కూడా తెగిపోతున్నాయి. ఆ కారణంగానే చిరంజీవి ఈ విధంగా చేసుంటాడేమో అని కూడా మాట్లాడుకుంటున్నారు.  చిరంజీవి ఏ కారణం చేత ఈ నిర్ణయం తీసుకున్న అంతా మంచికే అంటూ జనాలు పొగిడేస్తున్నారు. చిరంజీవి ప్రెసెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో బిజీగా ఉన్నాడు . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతున్నట్లు తెలుస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: