- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

తెలుగు ప్రేక్షకులు ఎన్నో ఏళ్లుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీర మల్లు’ రిలీజ్‌కు ఇక వేళాయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటించిన ఈ సినిమా జూలై 24న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదలకు ముందు అభిమానుల్లో క్రేజ్ ఎక్కడికెళ్లిందంటే… ఇప్పటికే బుకింగ్స్‌ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. ఈ సినిమా నైజాం బుకింగ్స్ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. సాధారణంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయిన బుక్ మై షో ప్లాట్‌ఫారంపై కాకుండా, 'District' అనే స్పెషల్ యాప్‌ ద్వారా ముందుగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రిలీజ్‌కు రెండు రోజుల ముందే ఈ యాప్‌లో టికెట్లు లభ్యమవుతుండటంతో అభిమానులు దానిపై ఫోకస్ పెట్టారు. బుక్ మై షోలో బుకింగ్స్ కొంచెం ఆలస్యంగా తెరుచుకోవడం వెనుక డిస్ట్రిబ్యూషన్ టీమ్ వ్యూహాత్మక నిర్ణయమేనని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.


బుకింగ్స్‌కి ముందు టికెట్ రేట్ల పెంపు వార్త కూడా అభిమానుల్లో జోష్‌ను పెంచేసింది. తెలంగాణలో హరిహర వీర మల్లు టికెట్ ధరల్లో హైక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఓ ఫెస్టివల్ లాంటి వాతావరణం. అలాంటి సమయంలో టికెట్ రేట్ల పెంపు తో ఫ‌స్ట్ డే అదిరిపోయే క‌లెక్ష‌న్లు న‌మోదు అవుతాయ‌ని ట్రేడ్‌వ‌ర్గాలు లెక్క‌లు క‌డుతున్నాయి. ఇదిలా ఉంటే, గత రాత్రి హరిహర వీర మల్లు ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు సినీ పరిశ్రమ నుంచి పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరై వీర‌మ‌ల్లు యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ పర్సనల్‌గా స్టేజ్‌పై వచ్చిన ఈ వేడుక ఆయన అభిమానుల్లో పండగ వాతావరణాన్ని కలిగించింది. ఈ సినిమాలో కథానాయికగా నిధి అగర్వాల్ నటిస్తుండగా, ఆమె ప్రమోషన్లలో చూపించిన డెడికేషన్ విశేషంగా నిలిచింది. ట్రైలర్ రిలీజ్ నుంచి ఈవెంట్‌ల దాకా ఆమె నటించిన పాత్రను పరిచయం చేస్తూ మీడియా ముందుకు రావడం సినిమాపై క్రేజ్‌ను మరింత పెంచింది. ఆమెతో పాటు బాలీవుడ్ విలన్ బాబీ డియోల్, నాజర్, సునీల్, అనసూయ, పూజిత పొన్నాడ, సత్యరాజ్ వంటి నష్టగల తారాగణం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: