
ఇందులో మీనా మాట్లాడుతూ.. తాను కృష్ణ ,రజనీకాంత్ వంటి హీరోలకు కూతురిగా, హీరోయిన్గా కూడా నటించానని.. చాలామంది నిర్మాతలు కూడా తాను ఫ్లాపుల్లో ఉన్నప్పుడు తక్కువ రెమ్యూనరేషన్ కి నటిస్తానని తనని ఎక్కువగా సంప్రదించే వారిని వెల్లడించింది. అలా నటించిన చిత్రాలే సూపర్ హిట్ గా మారాయని.. కెరియర్లో వరుసగా అవకాశాలు వస్తున్న సమయంలోనే వివాహం చేసుకున్నాను అయితే ఆ తర్వాత పాప పుట్టింది.. మళ్లీ అవకాశాల కోసం ప్రయత్నించలేదని.. ఆ సమయంలో మలయాళ సినిమా దృశ్యం కోసం తనని సంప్రదించారని.. పాపని వదిలి వెళ్లలేక సినిమాలను ఒప్పుకోలేదు..దృశ్యంలో పాత్రను తనను ఊహించుకొని డైరెక్టర్ రాశామని చెప్పారు. ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తానని చెప్పడంతో అందుకే ఒప్పుకున్నానని తెలిపింది..
ఇక రెండో వివాహం గురించి మాట్లాడుతూ తన భర్త చనిపోయిన వారానికే తాను మరొక పెళ్లి చేసుకుంటానని రూమర్స్ క్రియేట్ చేశారు..అలాంటి వారికి కుటుంబాలే ఉండవా ?ఇలా రాస్తున్నారంటూ చాలా సార్లు బాధపడ్డాను. ఇండస్ట్రీలో ఎవరు విడాకులు తీసుకున్న నాతోనే పెళ్లి అంటూ రాసేస్తున్నారు.. అలాంటి విషయాలు విన్నప్పుడు చాలా అసహ్యం వేస్తుంది అంటూ తెలిపింది మీనా. 2009లో విద్యాసాగర్ ను వివాహం చేసుకోగా 2002లో ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటినుంచి మీనా రెండవ పెళ్లి అంటూ చాలా రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి.