
ఈ ముగ్గురు హీరోలు సినిమాను వృత్తిగా మాత్రమే కాకుండా ఒక బాధ్యతగా తీసుకుంటారు. వాళ్లకు కథ చెప్పడానికి వచ్చిన డైరెక్టర్ ఎవరైనా సరే, ముందు కథను గౌరవిస్తారు. కథ బలం, పాత్ర ప్రాధాన్యం, భావోద్వేగం – ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా అనే విషయాన్నే వీరు ప్రాముఖ్యంగా చూస్తారు. “మా రోల్ హైలైట్ కావాలి, మా డైలాగ్స్ ఎక్కువగా ఉండాలి, మేమే సినిమాకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలి” అని ఎప్పుడూ డిమాండ్ చేయరు. డైరెక్టర్ చెప్పినదే ఫైనల్, సినిమా మొత్తం ఒక టీమ్ వర్క్ అని నమ్ముతారు. అందుకే ఈ ముగ్గురు చేసే సినిమాలు సాధారణంగా కంటెంట్ స్ట్రాంగ్‌గా, ప్రెజెంటేషన్ గ్రాండుగా, ఎమోషన్ రిచ్‌గా ఉంటాయి.
మరీ ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో వీరి అప్రోచ్ పూర్తిగా డిఫరెంట్. చాలామంది స్టార్ హీరోలు “మా సినిమాలో హీరోయిన్‌గా ఫ్లాప్ బ్యూటీ ఉండకూడదు, హాట్ గ్లామర్ ఉండాలి, ఈమధ్య హిట్టయిన హీరోయిన్ కావాలి” అంటూ కండిషన్స్ పెడుతుంటారు. కానీ ప్రభాస్, చరణ్, తారక్ లాంటి హీరోలు మాత్రం ఆ రీతిలో ఆలోచించరు. వాళ్ల దృష్టిలో హీరోయిన్ అంటే కథలో భాగం, పాత్రకు తగినది ఎవరో ఆమెనే ఎంపిక చేయాలి అనేది. అందుకే వీరు చేసిన సినిమాల్లో ఎక్కువగా కొత్త ఫేస్‌లు, కంటెంట్ బెస్డ్ హీరోయిన్ రోల్స్ కనిపిస్తాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ముగ్గురి గురించి ఒక ఆసక్తికరమైన చర్చ బాగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ ముగ్గురు స్టార్ హీరోలతో రష్మిక మందన్నా ఒక్క సినిమాకీ కూడా జట్టుకాలేదు. అంటే — చరణ్, తారక్, ప్రభాస్ ముగ్గురిలో ఎవ్వరితోనూ రష్మిక స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అంతేకాదు, ఫ్యూచర్‌లో కూడా ఇప్పటివరకు ఉన్న అప్‌కమింగ్ ప్రాజెక్టుల లిస్ట్‌లో అలాంటి ఏ కాంబినేషన్ కనిపించడం లేదు.
దీంతో సోషల్ మీడియాలో అభిమానులు వాదనలు మొదలుపెట్టారు. “రష్మిక మందన్నా ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్ అయి ఉండొచ్చు, కానీ ఈ ముగ్గురు హీరోలు మాత్రం ట్రెండ్ సెట్ చేయించే వాళ్లు. వాళ్లు ఎప్పుడూ కథ బలం మీదనే సినిమాలు చేస్తారు. అందుకే స్టార్ హీరోయిన్ లేకపోయినా సినిమా హిట్ అవుతుందని వాళ్లు నమ్ముతారు” అని ఫ్యాన్స్ అంటున్నారు. రష్మిక ఇప్పటికే అల్లు అర్జున్ తో పుష్ప, మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమాల్లో నటించింది. అంటే టాలీవుడ్ టాప్ హీరోల్లో ఎక్కువమందితో రష్మిక పని చేసింది. కానీ చరణ్, తారక్, ప్రభాస్ ముగ్గురితో మాత్రం ఇప్పటివరకు ఒక ఫ్రేమ్ లో కూడా కనిపించలేదు. దీంతో సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు చమత్కారంగా వ్యాఖ్యానిస్తున్నారు — “రష్మిక లాంటి స్టార్ హీరోయిన్ మా హీరోల సినిమాలకు కావాల్సిన అవసరం లేదు. మేము కథ ఆధారంగా హిట్టులు సాధించే హీరోల ఫ్యాన్స్. మా హీరోలు స్టార్ హీరోయిన్ వల్ల కాదు, తమ నటన వల్లే హిట్టులు కొడతారు” అని అంటున్నారు..!!