ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రత్యక్ష ప్రచారం పై సందిగ్ధత నెలకొంది. బహిరంగ సభలు, ర్యాలీల పై ఈసీ విధించిన నిషేధం నేటితో ముగియనుంది. కరోనా ఉదృతి ఎక్కువ గా ఉండడంతో నిషేధం పొడగించాలనే ఆలోచనలో ఉంది ఈసి. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ నిపుణులు, ఐదు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఎన్నికల అధికారులతో వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తూ వారి అభిప్రాయాలను తీసుకుంటోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు  జనవరి 8న షెడ్యూల్ ప్రకటించింది ఈసి. ఓమిక్రాన్ ప్రభావంతో భౌతిక ర్యాలీలు, రోడ్ షోలు, బైక్ ర్యాలీలు వంటి ప్రచార కార్యక్రమాలపై జనవరి 15 వరకు నిషేధం ప్రకటించారు. ఆ తర్వాత కరోనా కేసులు అదుపులోకి రాకపోగా మరింతగా పెరుగుతుండడంతో ఆ నిషేధాన్ని జనవరి 22 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

రాజకీయ పార్టీలు 3 వందలకు మించకుండా, 50 శాతం ఆక్యుపెన్సీ తో ఇండోర్ సమావేశాలను నిర్వహించుకోవచ్చని  వెసులుబాటు కల్పించింది. ఈ నిషేధాజ్ఞలు నేటితో ముగియనుండడంతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు,కేంద్ర ఆరోగ్య శాఖ,వైద్య శాఖ నిపుణులు ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల అధికారులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఓమిక్రాన్ ఉదృతంగా వ్యాప్తి చెందుతూ ఉంది. కేసులు అంతకంతకూ పెరుగుతున్నటువంటి పరిస్థితి. లక్షల్లో ప్రతిరోజు కేసులు నమోదవుతున్న నేపథ్యంలో 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఈసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ప్రచారం అనేది ఎన్నికల్లో చాలా ప్రధానమైనటువంటి ఘట్టం. ప్రజల వద్దకు నేతలు వెళ్లడం,వారి హామీలను చెప్పుకోవడం  మరియు ఇతర పార్టీల మీద విమర్శలు గుప్పించడం వంటివి జరుగుతూ ఉంటాయి.

 ప్రచారం అనేది ప్రజల్లోకి వెళ్లడానికి చాలా కీలకమైనది. ప్రజల నుంచి ఓట్లు రాబట్టడానికి ప్రచారమే ముఖ్యం. ఈ నేపథ్యంలో ప్రచారం మీద సందిగ్దత నెలకొంది. ఇన్నాళ్లు వర్చువల్ సమావేశాలు నిర్వహించుకోవచ్చు అలాగే లిమిటెడ్గా కార్యకర్తలతోటి సమావేశాలు నిర్వహించుకోవచ్చు అని అనుమతి ఇచ్చింది. ఈరోజుతో నిషేధాన్ని ముగిసింది.కాబట్టి ఈ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది అందరిలో ఆసక్తి నెలకొంది. కరోనా కేసులో ఉదృతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: