ప్రస్తుతం తెలంగాణలో జరిగే ఆర్టీసి సమ్మె విషయంలో కార్మికులకు అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చిన విషయం విదితమే.ఇప్పటికే అక్కడి పరిస్థితులు చిలికి చిలికి గాలి వాన అయ్యినట్టు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఎటువంటి పరిష్కారం తేల్చలేదు. ఈ విషయం పై పవన్ కళ్యాణ్ ఆర్టీసీ కార్మికులు.... ప్రత్యేక తెలంగాణ కోసం వారు చేసిన మద్దతును మర్చిపోకూడదు అన్నారు. ఒక్క ఆర్టీసీ కార్మికులనే కాకుండా వారి కుటుంబాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి సూచించారు.

కార్మిక కుటుంబాలు ఆర్థిక మరియు ఆకలి బాధలతో అలమటిస్తూ ఉంటే అది రాష్ట్రానికి మంచిది కాదని ఆయన అన్నారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు హయాంలో బషీర్బ బాగ్ లో జరిగిన ఉదంతాన్ని గుర్తుకు చేస్తుందన్నారు. ఆ కాల్పుల్లో ఎంతోమంది రైతులు తమ ప్రాణాలను వదిలారు అలాగే చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పుడు ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె చూస్తుంటే తనకు ఆ బషీర్ బాగ్ సంఘటనే గుర్తుకు వస్తుంది అన్నారు. అప్పట్లో ఆ విషయం తనని ఎంతో కలచివేసిందని, ఇప్పుడు ఈ ఆర్టీసి సమ్మె కూడా అంతగానే కలిచివేస్తోంది అన్నారు.

టీ.ఎస్ఆర్.టి.సి, జేఏసీ నేతలు వారి సమ్మెను ఆయా పార్టీలకు వివరించే భాగంగా మొన్న హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ పార్టీ ఆఫీసు కి వెళ్లారు. అక్కడ గత 27 రోజులుగా వారు చేస్తున్న సమ్మె గురించి... వారి డిమాండ్ల గురించి పవన్ కు వివరించారు. వారితో పవన్, మీరు ధైర్యాన్ని కోల్పోకూడదు అని చెప్పారు. జేఏసీ నేతలతో మాట్లాడిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. తనవంతుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల తరపున టిఆర్ఎస్ నేత కెసిఆర్ తో మాట్లాడుతానన్నారు. 

పవన్ కళ్యాణ్ ఈ నెల మూడో తారీఖున భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ ను నిర్వహించనున్న విషయం తెలిసిందే. దాని కంటే ముందే కేసిఆర్ అపాయింట్మెంట్ తీసుకొని వారితో ఆర్టీసీ కార్మికుల సమస్యల గురించి చర్చిస్తాం అని అన్నాడు. అలాగే వారి డిమాండ్స్ గురించి కూడా ఆయనకు వివరిస్తానన్నారు. అలాగే టిఆర్ఎస్ పార్టీ లోని ముఖ్య నేతలకు వ్యక్తిగతంగా తన తరపు మెసేజ్ ను పంపుతాను అన్నారు. ఒకవేళ కకేసిఆర్ గారి తో కలిసే అవకాశం రాకపోతే ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ ప్రణాళికలలో తాను భాగం అవుతానన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: