ఇప్పటికే పీకల్లోతు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నాయకులకు ఇప్పుడు మరో షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర కీలక నాయకుడు కింజరాపు అచ్చేమ్ నాయుడు పాత్ర ఉన్నట్లుగా ఆధారాలతో సహా బయట పడడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి  అచ్చెన్నాయుడు పాత్ర ఉన్నట్లుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్  తమ నివేదికను బయట పెట్టింది. ఈ విధంగా గత ఆరేళ్లలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లుగా విజిలెన్స్ నివేదికలో బయటపెట్టింది. ఈఎస్ఐ లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్ ఇచ్చినట్లుగా విజిలెన్సు తేల్చింది.


 నామినేషన్ల పద్ధతిలో మెడిసిన్స్, ల్యాబ్ కిట్లను పూర్తిగా అందజేయాలని కోరూతూ అచ్చెన్నాయుడు అప్పట్లో డైరెక్టర్ రవికుమార్‌కు లేఖ రాశారు.ఈ లేఖను పరిగణలోకి తీసుకుని ఈఎస్ఐ డైరెక్టర్ నామినేషన్ పద్ధతిలో మెడిసిన్స్ ఇచ్చారు. దీనికి సంబంధించి నివేదికను కూడా ఇప్పుడు విజిలెన్స్ బయటపెట్టింది. మొత్తం ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్లుగా విజిలెన్స్ బయటపెట్టడం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఇప్పుడు ఈ వ్యవహారంలో అడ్డంగా బుక్కవడం కలకలం రేపుతోంది. 


ఇప్పుడు తెలుగుదేశం లో కూడా ఈ వ్యవహారం ఆందోళన కలిగిస్తోంది. ఒక పక్క ఐటి దాడులతో నిత్యం భయం భయంగా గడుపుతున్న టీడీపీ అగ్ర నేతలకు ఈ వ్యవహారం  గోరు చుట్టిపై రోకలిపోటులా కనిపిస్తోంది. పోనీ దీంట్లో అచ్చెన్నాయుడు పాత్ర లేదని గట్టిగా వాదిద్దామన్నా సాక్షాలు కూడా బయటపడడంతో ఈ వ్యవహారంలో అచ్చెన్నాయుడు పూర్తిగా ఇరుక్కున్నట్టుగానే తెలుస్తోంది. ఇక ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో ఇరుకున్న అచ్చెన్న ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని చూస్తోంది. చంద్రబాబు తరువాత వైసీపీ ని విమర్శిస్తున్న వారిలో అచ్చెన్న కీలకంగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: