ఉండవల్లి అరుణ్ కుమార్...ఒకప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఉండవల్లి..రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ని వదిలి ఏ పార్టీలో చేరకుండా అలా ఉండిపోయారు. కానీ ఏపీ రాజకీయాలపై ఎప్పటికప్పుడు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఓ విశ్లేషుకుడుగా ఉంటూ, అప్పుడప్పుడు మీడియా ముందుకొచ్చి, తనదైన శైలిలో రాజకీయాల మీద మాట్లాడి వెళుతుంటారు.

అయితే ఉండవల్లి...ఎక్కువగా జగన్‌కు అనుకూలంగా మాట్లాడతారనే టాక్ ఉంది. టీడీపీ నేతలు ఇదే విషయంపై ఎప్పుడు విమర్శలు చేస్తుంటారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విమర్శలు చేసిన ఉండవల్లి..ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు చేయడం లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఉండవల్లి సుప్రీం కోర్టు జడ్జీ రమణపై జగన్ ఫిర్యాదు చేస్తూ, సుప్రీం సి‌జే‌ఐ బాబ్డేకు రాసిన లేఖపై స్పందించారు.

మొదట నాయకులపై కేసుల విచారణ వర్చువల్ కోర్టులు ద్వారా జరగాలని, అలాగే కేసులు విచారణ లైవ్ ఇవ్వాలని సి‌జే‌ఐకు లేఖ రాసిన ఉండవల్లి... కోర్టులపై సీఎం లేఖ రాయటం కొత్త కాదని, గతంలో ముఖ్యమంత్రి సంజీవయ్య కూడా 1960లోనే కోర్టులపై లేఖ రాశారని, కాకపోతే లేఖ రాయటం కంటే జగన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం తప్పా? రైటా అనే విషయం పైనే చర్చ జరుగుతోందని అన్నారు.
అయితే జస్టిస్ రమణ విషయంలో ఆరోపణలు వ్యక్తిగతంగా తాను నమ్మనని, కానీ న్యాయవ్యవస్థలో లోపాలను రాజకీయ వ్యవస్థలు సరిదిద్దాలని, చట్టం ముందు జడ్జీలు అతీతులు కాదని చెప్పారు.

అయితే ఉండవల్లి మాటలు చూస్తుంటే కర్రా విరగకూడదు...పాము చావకూడదు అన్న విధంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇందులో జగన్‌ది తప్పు ఉందని చెప్పారో లేదో అర్ధం కాకుండా ఉంది. అలాగే రమణని సపోర్ట్ చేస్తున్నారో లేదో కూడా తెలియలేదు. మొత్తానికైతే ఉండవల్లి న్యూట్రల్ పాలిటిక్స్ చేసి, ఏపీ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్ అయ్యారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: