కేంద్ర ప్రభుత్వం నుంచి అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులు ప్రారంభించు కునేందుకు రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రం అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులకు ఇప్పటివరకు ఒక క్లారిటీ రాలేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులు ప్రారంభం అవుతాయని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభించేందుకు అటు  రెండు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థల మధ్య పలుమార్లు చర్చలు కూడా జరిగినప్పటికీ విఫలమయ్యాయి.



 తెలంగాణ ఆర్టీసీ ప్రతిపాదనలు ఏపీఎస్ఆర్టీసీ అంగీకరించకపోవడంతో ఇప్పుడు వరకు రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభించేందుకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఎట్టకేలకు ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణ ప్రతిపాదనకు అంగీకరించి సరికొత్త ప్రతిపాదన తెలంగాణ ఆర్టీసీ ముందుకు తెచ్చింది. ఇప్పటివరకు తెలంగాణ ఆర్టీసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కనీసం ఈ పండుగ సీజన్లో అయినా ప్రయాణికుల రద్దీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అంతర రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులు ప్రారంభం అవుతాయని ఆర్టీసీ ప్రయాణికులందరూ ఎంతగానో ఎదురుచూశారు కాని వారికి నిరాశ తప్పదు అన్న విధంగా మారిపోయింది పరిస్థితులు.




 అయితే ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల మధ్య అంతర రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దసరా పండుగకు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాలనుకునే ప్రయాణికులకు రేపు గుడ్ న్యూస్ అందే  అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య అంతర రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసుల ప్రారంభంలో భాగంగా రేపటి నుంచి బస్సులు రోడ్డెక్కే  అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ ప్రతిపాదనలకు ఏపీఎస్ఆర్టీసీ సానుకూలంగా స్పందించగా నేడు మరోసారి ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో రాష్ట్రాల మధ్య అంతర రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసుల ప్రారంభానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: