దుబ్బాక లో ఎన్నికలకు మరో మూడు రోజులే సమయం ఉండడంతో అక్కడ అన్ని పార్టీ లు ప్రచారాల జోరును పెంచాయి.. ఏ పార్టీ కి ఆ పార్టీ తమ పార్టీ గెలుస్తుందంటే తమ పార్టీ గెలుతుందని ధీమా గా ఉండడంతో ఇక్కడ రాజకీయం కొంత ఆసక్తి గా మారిపోయింది. కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీ లు సైతం ఇక్కడ తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.. మరో వైపు అధికార పార్టీ కూడా ఏం తక్కువ తినలేదు.. దుబ్బాలలో గులాబీ జెండా రేపెరేపలాడడం ఖాయం అన్నట్లు వ్యాఖ్యలు చేస్తుంది. హరీష్ రావు అయన తన సొంత నియోజకవర్గంలా ఇక్కడ పార్టీ కోసం పనిచేస్తున్నారు.. కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై శ్రద్ధ వహించగా, కేటీఆర్ గ్రేటర్ పై ద్రుష్టి సారించారు.. దాంతో హరీష్ రావు కి దుబ్బాక లో పార్టీ ని గెలిపించే బాధ్యత ని ఇచ్చారు..

ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో పార్టీ గెలుపు ఢంకా మోగించాలని కేసీఆర్ ఆదేశాలిచ్చారట.. సాదా సీదా విజయం కాదు ఇక్కడి గెలుపు తో విర్రవీగిపోతున్న ప్రతిపక్షాల నోళ్లు మూయించేలా గెలుపు కావాలని కేసీఆర్ కోరుకుంటున్నారట.. ఇక ఈ ఎన్నికల్లో విజయం పై కేసిఆర్ కూడా ఎంతో నమ్మకంగా ఉన్నట్లు అయన మాటలని బట్టి తెలుస్తుంది. మొట్ట మొద‌టి సారిగా సీఎం కేసీఆర్ ఆ ఎన్నిక‌కు సంబంధించి‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయాన్ని ఎవ‌రూ అడ్డుకోలేరని.. విజయం త‌మ‌దేన‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌కు పెద్ద లెక్కేకాదన్నారు.

ఓ కార్య‌క్ర‌మంలో దుబ్బాకలో రాజకీయ ఘర్షణలు పెరగడం..బీజేపీ అభ్యర్థి బంధువు ఇంట్లో డబ్బు పట్టుబడిన వ్యవహారం రాజకీయంగా వేడిని పుట్టించడంపై కొందరు ప్రశ్నించగా సీఎం సమాధానమిచ్చారు. దుబ్బాకలో మంచి మెజారిటీతో గెలుస్తామ‌ని, ఈ చిల్లర తతంగాలు నడుస్తూనే ఉంటాయని తీసి పాడేశారు. అయితే ఇదిలా ఉండ‌గా రాజ‌కీయ విశ్లేష‌కులు మాత్రం దుబ్బాకలో గెలుపు ట‌ఫ్‌గానే ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక బీజేపీ తరపున రఘు నందన్ రెడ్డి పోటీ చేస్తుండగా రామలింగారెడ్డి భార్య సుజాత అధికార పార్టీ టీ ఆర్ ఎస్  పార్టీ క్యాండిడేట్గా నిలిపింది. కాంగ్రెస్ తరపున చెరుకు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి  బరిలోకి దిగారు. మరి ఈ ముగ్గురిలో ఎవరు గెలుపు గుర్రం ఎక్కుతారో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: