ఇదే సమయంలో ఎన్నికలకు ముందు సభల్లో జగన్..మూడు వేల పెన్షన్ ఇస్తానని చెప్పారని, కానీ మేనిఫెస్టోలో పెంచుకుంటూ పోతామని పెట్టారని, అయితే మొదట 250 రూపాయలు పెంచిన జగన్ ప్రభుత్వం ఈ సంవత్సరం మాత్రం ఇంకా పెంచలేదని మాట్లాడుతున్నారు. అలాగే 45 ఏళ్ళు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు పెన్షన్ ఇస్తానని చెప్పారని, కానీ గెలిచాక వైఎస్సార్ చేయూత ద్వారా సంవత్సరానికి రూ. 18, 750 ఇచ్చారని, కానీ పెన్షన్ ఇచ్చి ఉంటే సంవత్సరానికి 36 వేలు వచ్చాయని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చెప్పే ప్రయత్నం చేశారు.
ఇక దీనిపై జగన్ సీరియస్ అయ్యి, నిమ్మల అబద్దాలు చెబుతున్నారని చెప్పి, ఆయనపై సభ హక్కుల నోటీసు ఇస్తామని చెప్పారు. దీనికి కౌంటర్‌గా టీడీపీ నేతలు రివర్స్ అయ్యి, అసెంబ్లీ సమావేశాల్లో పెన్షన్లపై ముఖ్యమంత్రి జగన్మోహన్ తప్పుడు సమాచారం ఇచ్చారని, దానికి వ్యతిరేకంగానే ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని టీడీపీ చెప్పింది. అక్టోబరు 2018నాటికి గత ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ల వివరాలపై తప్పుడు వివరాలు చెప్పి సభను తప్పుదోవపట్టించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారని, ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు టీడీపీ తెలిపింది. అయితే టీడీపీ నేతలు అసెంబ్లీలో ఇష్టారాజ్యంగా మాట్లాడేసి, ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయాలనే చూస్తున్నారని, అందుకే జగన్ సీరియస్ అయ్యారని, కానీ టీడీపీ ఇప్పుడు రివర్స్‌లో జగన్‌ని ఇబ్బందిపెట్టాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి