అయితే గోదావరి జిల్లాలో మారుతున్న సామాజిక - రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ హైకమాండ్ ముద్రగడ ఫ్యామిలీపై భారీ బాధ్యతలు వేయాలని చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రత్తిపాడు కంటే పిఠాపురం నుంచి ముద్రగడ వారసుడు గిరిని పోటీ చేయించాలని ఆలోచన జరుగుతోందట. ముద్రగడకు పిఠాపురంలో బలమైన అనుచర వర్గం ఉండటం, ఆయనకు ఆ ప్రాంతంపై సహజమైన పట్టు ఉండటం ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ ఇంచార్జ్‌గా ఉన్న వంగా గీత పనితీరుపై వైసీపీ పెద్దలు అసంతృప్తిగా ఉన్నారని, ఆమె కూడా పిఠాపురం సీటు వద్దని భావిస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం. దీంతో పిఠాపురం వైసీపీ భవిష్యత్తు పూర్తిగా ముద్రగడ కుటుంబం చుట్టూ తిరిగే అవకాశం కనిపిస్తోంది.
ఇక పవన్ కళ్యాణ్‌పై వైసీపీ వేసే లెక్కలు వేరే. ఆయన ఒక ‘రూటిన్ పొలిటిషియన్’ కాదని, కానీ 2024లో ఆయనను కాపు వర్గం భావోద్వేగంతో గెలిపించిందనే అభిప్రాయం వైసీపీకి బలంగా ఉంది. కూటమి పాలన పట్ల కాపులలో పెరుగుతున్న అసంతృప్తి 2029 నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని వైసీపీ అంచనా వేస్తోంది. అలాంటి సమయంలో పవన్‌ను ఎదుర్కోవడంలో ముద్రగడ కుటుంబం కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తూ, వ్యూహాలు రచిస్తోంది. ఇదంతా చూస్తే పిఠాపురంలో “పవన్ వర్సెస్ ముద్రగడ” సీన్ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశం ఉన్నట్టే. అయితే ఈ మాస్టర్ ప్లాన్‌పై ముద్రగడ ఎంతవరకు ముందుకు వస్తారన్నది ఇప్పటికీ ఆసక్తికర ప్రశ్నగానే ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి