హైదరాబాద్ లో వ్యాపారవేత్త కిడ్నాప్ వ్యవహారంపై సీపీ అంజనీ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. శ్రీనగర్ కాలనీ లో  అమర్ నాథ్ రెడ్డి అనే వ్యక్తి కిడ్నాప్ అయ్యాడు  అని ఆయన వివరించారు. ఆయన భార్య  కల్పన రెడ్డి మాకు కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదు చేసారని పేర్కొన్నారు. అమర్ నాథ్ రెడ్డి ను మొత్తం 6 గురు కిడ్నాప్ చేశారు , నలుగుర్ని అరెస్ట్ చేశాము  అని ఆయన అన్నారు. మూడు గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించాము  అని వివరించారు. వేస్ట్ జోన్ జాయింట్ సిపి ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ...

మాధపూర్ ఆఫీస్ కి వెళ్లిన అమర్ నాథ్ రెడ్డి ని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు  అని పేర్కొన్నారు. భాదితుడు భార్య కల్పన ఫిర్యాదు తో కేసు నమోదు చేసి , వారు అడిగిన డబ్బలు పోలీసులే సమకూర్చారని  పేర్కొన్నారు. డబ్బులు ఇస్తామని చెప్పడం తో వనస్థలిపురం నుండి శ్రీనగర్ కాలనీ కి తీసుకొచ్చారు అన్నారు. ప్రదీప్ నటరాజన్, లోకేష్ డబ్బులు కోసం శ్రీనగర్ కాలనీ వచ్చారు , అక్కడ నుండి ప్రదీప్ నటరాజన్ తప్పించుకున్నాడు అని వివరించారు. శ్రీనగర్ కాలనీ లో  లోకేష్ ను అరెస్ట్ చేయగా విషయాలు అన్ని బయట పడ్డాయి అని ఆయన పేర్కొన్నారు.

అమరనాథ్ రెడ్డి కి ఈ కిడ్నాపర్లు కు మధ్య ఆర్థిక పరమైన విభేదాలతో ఈ కిడ్నాప్ జరిగింది అని ఆయన తెలిపారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వక పోతే చైన్నై కి తీసుకొని పోయి హత్య చేస్తామని చెప్పి భయపెట్టారని అన్నారు. దీంతో మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా  కిడ్నాపర్లు ను నల్గొండ వద్ద అరెస్ట్ చేశాము అని ఆయన తెలిపారు. ఇక ఈ వ్యవహారం రెండు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. కేసుని చేధించడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: