వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో సీఐడీ అధికారులు తప్పులు చేశారు అనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతుంది. రాజకీయంగా సీఐడీ అధికారులు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. సీఐడీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని కూడా పలువురు మండిపడుతున్నారు. సీఐడీ అధికారులు విషయంలో హైకోర్టు కూడా ఆగ్రహం గానే ఉంది. ముందు సీఐడీ కోర్ట్ చెప్పినా సిఐడి అధికారులు రఘురామకృష్ణంరాజు ని రమేష్ ఆస్పత్రికి తరలించే విషయంలో వెనక ముందు ఆలోచించలేదు.

జైలు కి తరలించారు. ఆ తర్వాత పరిణామాలు అన్నీ కూడా కాస్త వేగంగా మారాయి. రఘురామకృష్ణంరాజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నేరుగా జిల్లా జైలుకు తరలించారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను సగం మాత్రమే అమలు చేస్తున్నారంటూ హైకోర్టు మండిపడింది. వాస్తవానికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా రఘురామకృష్ణంరాజు విషయంలో హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సీఐడీ అధికారులు ఎవరూ ఏమీ ఆలోచించకుండా సొంతంగా నిర్ణయం తీసుకున్నారు.

 దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నడుచుకుంటారు అనే వ్యాఖ్యలు వినిపించాయి. రఘురామకృష్ణంరాజు వైద్య నివేదికకు సంబంధించి ఫిట్ రిపోర్టు ఆధారంగా తాము చర్యలు తీసుకున్నామని.. రఘురామకృష్ణంరాజుని జైలుకు తరలించామని అధికారులు చెప్పారు. సీఐడీ అధికారులకు గాని లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని హైకోర్టు చెప్పలేదు. సీల్డ్ కవర్లో తమకు నివేదిక పంపించాలి అంటూ ఆదేశాలిచ్చింది. దీంతో ఇప్పుడు రఘురామకృష్ణంరాజు విషయంలో ఏం జరగబోతోంది ఏంటి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రఘురామకృష్ణంరాజు విషయంలో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స వైద్య పరీక్షలు చేయించాలి అని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆయనను తక్షణం తరలించాలంటే కూడా స్పష్టంగా పేర్కొంది. రఘురామకృష్ణంరాజు విషయంలో రేపు నివేదిక వచ్చే అవకాశం ఉంది అని అందరు ఆసక్తిగా చూస్తున్నారు. దాదాపుగా ఈ నివేదిక రేపు సాయంత్రానికి వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: