
మంత్రి నారా లోకేష్ న్యూ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఏపీ కి పలు ప్రాజెక్టుల కోసం వరుసగా పలువురు ప్రముఖులతో భేటీ అవుతూ సక్సెస్ అవుతున్నారు. తాజాగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... రాయలసీమలో హైకోర్టు బెంచి ఏర్పాటు అక్కడి ప్రజల చిరకాల కోరిక, కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటుకు సహకరించండి. న్యాయపరమైన అవసరాల కోసం రాయలసీమ ప్రజలు ఎపి రాజధానికి రావడానికి 500 కి.మీ.కు పైగా ప్రయాణించాల్సి ఉంటుంది. యువగళం పాదయాత్ర సందర్భంగా సీమ ప్రజలు, న్యాయవాదులు హైకోర్టు బెంచి చేయాలని విన్నవించారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా త్వరితగతిన బెంచి ఏర్పాటుకు సహకరించాలి. రాష్ట్రంలోని కోర్టుల్లో జ్యుడిషియరీ ఇన్ ఫ్రాస్ట్చక్చర్ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.
ఈ సందర్భంగా యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని మంత్రి లోకేష్ కేంద్రమంత్రికి అందజేశారు. ఈ పుస్తకం చూసిన అర్జున్ రామ్ మేఘావాల్ లోకేష్ పాదయాత్ర చేసిన తీరుతో పాటు ఆ పట్టుదలను ప్రశంసించారు. ఇక రాయలసీమలో మరో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అయితే ఖచ్చితంగా రాయలసీమ ప్రజలకు న్యాయం జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. న్యాయ పరమైన సమస్యల పరిష్కారంలో సీమ ప్రజలు సుదూరంలో ఉన్న అమరావతికి వచ్చే వ్యయ, ప్రయాసలు తప్పుతాయి. సత్వర న్యాయం అందుతుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు