
అలాగే గోదావరి తీరం వెంట పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి కోసం అఖండ గోదావరి పేరిట కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే .. దాదాపు రూ .94.4 కోట్లతో మొదలుపెట్టే ఈ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహా మరిన్ని ప్రాజెక్టులకు కేంద్రం మొత్తంగా రూ. 375 కోట్లను కేటాయించింది .. ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్టులను మొదలు పెట్టేందుకు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ విచ్చేయగా .. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ , పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ , రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి , స్థానిక ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ..
ఈ క్రమంలో పవన్ గతంలో నటించిన అజ్ఞాతవాసి సినిమాలో ఏ విధంగా కనిపించారో .. గురువారం అనగా ఈరోజు కూడా అదే లుక్ లో పవన్ ఈ కార్యక్రమానికి వచ్చారు .. క్రీమ్ కలర్ ప్యాంట్, దానిపై లైట్ గ్రీన్ షర్ట్ , ఇన్ షర్ట్ చేసుకొని ఎంతో క్లాస్ గా టిప్ టాప్ గా కార్యక్రమానికి వచ్చిన పవన్ ని చూసి నిజంగానే అక్కడికి వచ్చిన జనంతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు రాజకీయ నాయకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నారు .. అలాగే ఈ కార్యక్రమం అంత ఎంతో హుషారుగా కనిపించిన పవన్ .. తన ప్రసంగంలో కూడా అక్కడ వారికి నవ్వులు పూయించారు . ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో ఊహించిన రేంజ్ లో వైరల్ గా మారాయి ..