
*తాంబూలంలో కచ్చితంగా రెండు అంతకంటే ఎక్కువ తమలపాకులు ఉండేలా చూసుకోవాలి.
*రెండు వక్కలు.. రెండు పండ్లు ..రెండు పుష్పాలు ..పసుపు - కుంకుమ ..రెండు గాజులు కచ్చితంగా ఉండాలి.
*అంతేకాదు తమలపాకులను శుభ్రంగా నీటితో కడిగి ఉంచాలి.
*ఆకుపై మచ్చలు ఉన్న ఆకు అశుభ్రంగా ఉన్న అసలు తాంబూలానికి వాడకూడదు.
*అంతేకాదు అరటి పండ్లు.. ఆపిల్ తాంబూలంలో ఇవ్వచ్చు. అయితే అవి రెండు లెక్కన తీసుకోవాలి. వాటి తొడిమలు కూడా మన వైపు ఉండేలా చూసుకొని తాంబూలం ఇవ్వాలి .
*ఒకరు మనకు బొట్టు పెట్టి ఇచ్చిన పసుపు కుంకుమను వక్కను మరొక ముత్తైదువు స్త్రికి ఇవ్వకూడదు.
*అంతేకాదు పాడైపోయిన అరటి పండ్లను పాడైపోయిన ఆపిల్ పండ్లను అస్సలు తాంబూలంలో పెట్టి ఇవ్వకూడదు .
*మరీ ముఖ్యంగా చీకటి పడక ముందే తాంబూలం ఇవ్వడం మరింత మంచిది .
*ఇలాంటి కొన్ని పద్ధతులు పాటించడం వల్ల ఇచ్చిన వారికి పుచ్చుకున్న వారికి ఇద్దరికీ మంచిదే దోషం ఉండదు..!