
టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసిన మహిళతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎమ్మెల్యే సైగలు చేస్తూ వ్యవహరించడంపై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే వైరల్ అయినా వీడియో మార్ఫింగ్ చేసిన వీడియో అంటూ మహిళ ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీ విమర్శలకు బదులిస్తూ తానూ సెల్ఫీ వీడియో తీసుకోగా ఫోన్ హ్యాక్ చేసి వీడియోను వైరల్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు.
తప్పుడు ప్రచారం చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని మహిళ కోరినట్టు తెలుస్తోంది. మహిళ ఫిర్యాదు నేపథ్యంలో ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. మార్ఫింగ్ చేసి ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణలో ఈ వీడియోకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.
ఏపీ రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో ఊహించని స్థాయిలో ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలలో ఏవి నమ్మాలో ఏవి నమ్మకూడదో అర్థం కావడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా ఘటనలు పాలకులపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు