
మోహన్ బాబు కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 ఒక ఏళ్లు పూర్తయింది . ఈ సుదీర్ఘ ప్రయాణంలో మంచి విజయాలతో పాటు ఎన్నో ఒడిదుడుకులను కూడా ఎదుర్కొన్నారు. కొన్ని సినిమాలు హిట్ అవ్వగా మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా సరే మంచు మనోజ్ కి మాత్రం ఎప్పుడు ఓవర్గం ప్రేక్షకులు సపోర్టుగా నిలిచారు . కాగా ఇప్పుడు ఒక పవర్ఫుల్ సినిమాతో రెడీ అయ్యాడు మంచు మనోజ్ . తాజాగా సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ను రిలీజ్ చేశారు . "డేవిడ్ రెడ్డి" అనే సినిమాతో మంచు మనోజ్ మరొకసారి అభిమానులను పలకరించబోతున్నారు .
అఫీషియల్ గా కొద్దిసేపటి క్రితమే దీన్ని ప్రకటించారు . ఈ చిత్రాన్ని దర్శకుడు హనుమారెడ్డి యక్కండి డైరెక్ట్ చేయబోతున్నారు. వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది . విడుదలైన టైటిల్ పోస్టర్ మేకర్స్ విడుదల చేసిన సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది . అయితే డేవిడ్ రెడ్డి అనే టైటిల్ ని ఎందుకు మంచు మనోజ్ చూస్ చేసుకున్నారు అంటూ ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటున్నారు జనాలు . మనకు తెలిసిందే మనోజ్ - భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు . వీళ్ళ వైవాహిక జీవితం కూడా సాఫీగా ముందుకు వెళ్ళిపోతుంది. మౌనిక అంటే చాలా చాలా ఇష్టం మంచు మనోజ్ కి . ఈ క్రమంలోని "డేవిడ్ రెడ్డి" అనే టైటిల్ పెట్టడం ఆమె కోసమే అయి ఉంటుంది అంటున్నారు జనాలు . మరికొందరు మాత్రం దీన్ని ద్వంద అర్థాలు వచ్చేలా కామెంట్స్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు మంచు మనోజ్ "డేవిడ్ రెడ్డి" టైటిల్ హ్యాష్ ట్యాగ్స్ బాగా వైరల్ అవుతున్నాయి . చూడాలి మరి ఈ సినిమా ఆయనకు ఎలాంటి హిట్ అందిస్తుంది అనేది..??