- ( రాయ‌ల‌సీమ‌ - ఇండియా హెరాల్డ్ )

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి - టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస్ రెడ్డి పులివెందులలో మకాం వేశారు. ఎదురుదాడికి దిగితే తప్ప అధికారంలో ఉన్న టిడిపిని ఎదుర్కొని గెలవలేమని వైసిపి గట్టి నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే పోలీసులతో పాటు ఎన్నికల బాధ్యతలు చూస్తున్న అధికారులకు వైసీపీ నేతలు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగాలని .. లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు చేస్తున్నారు.


గతంలో పులివెందుల డిఎస్పి నాయక్ ను జగన్ దగ్గరికి పిలిపించుకుని మరి వార్నింగ్‌ ఇచ్చారు. అప్పటినుంచి డిఎస్పి దూకుడు తగ్గించినట్టు చెబుతున్నారు. జగన్ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం కావడంతో అన్ని శాఖల అధికారులు తమకు ఎందుకు వచ్చిన గొడవ అని ప్రస్తుతానికి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. ఇక టిడిపి గ్రామస్థాయి నాయకులు కూడా అత్యుత్సాహానికి పోతే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ? అని భయపడుతున్నారు. బీటెక్ రవి - జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని నమ్ముకుని వైఎస్ఆర్ కుటుంబంతో ఢీకొంటే భవిష్యత్తు లో త‌మ‌కు ఇబ్బందులు తప్పవన్న ఆలోచనలో టిడిపి నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పులివెందుల ఉప ఎన్నికలలో విజయం సాధించేందు కు వైసిపి అధికార టిడిపి తో ఢీ అంటే ఢీ అనే రీతిలో ముందుకు వెళుతుంది. మ‌రి ఈ పోరులో అంతిమంగా ఎవ‌రు విజ‌యం సాధిస్తారో ?  చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: