
అనసూయ మరో ఐటెం సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈసారి కూడా మెగా హీరోతోనే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. యస్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న చరణ్ ప్రెసెంట్ "పెద్ది" సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ అంత సజావుగా సాగుతున్న ఐటమ్ సాంగ్ విషయంలో మాత్రం బిగ్ కన్ఫ్యూషన్ ఉంది. ఏ హీరోయిన్ తో ఐటెం సాంగ్ చేయించాలి అంటూ తెగ టెన్షన్ పడిపోతున్నారు మేకర్స్ .
అయితే నిన్న మొన్నటి వరకు తమన్నా అని శ్రీలీల అంటూ రకరకాల పేర్లు వినిపించాయి . వీళ్ళందరూ కాదు అని గ్రేస్ ఉన్న హాట్ బ్యూటీని ఈ పాటకు సూట్ అవుతుంది అంటూ అనసూయను ఫైనలైజ్ చేసే పనిలో బిజీ అయిపోయారట మూవీ మేకర్స్. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా బాగా స్టెప్స్ వేసింది . ఇక ఇంతకంటే ఏం కావాలి అనే విధంగా మూవీ మేకర్స్ అనసూయకు ఆఫర్ ను ఇచ్చారట . అనసూయ కూడా అందుకు ఓకే చేసినట్లు తెలుస్తుంది . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతుంది అంటూ ఫిలిం వర్గాలలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . కాగా బుచ్చి బాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తున్నారు . ఈ సినిమా స్పెషల్ సాంగ్ కోసం తమన్నా - శ్రద్ధ కపూర్ - శ్రీ లీల లాంటి స్టార్ హీరోయిన్స్ నే ముందుగా అనుకున్నారు . ఆ తర్వాత అనసూయని ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తుంది..!!