
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏ ముసలం పుడుతుందో తెలియటం లేదు. ఇప్పటికే అసంతృప్తి నేత్తగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే కనుక మంత్రి పదవి వచ్చేదని .. కానీ మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసమే తాను మునుగోడు నుంచి పోటీ చేసినట్టు తెలిపారు. మంత్రి పదవి కావాలా ? మునుగోడు ప్రజలు కావాలా ? అంటే మునుగోడు ప్రజలే కావాలని కోరుకుంటానని తెలిపారు. పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తామన్నారు. భువనగిరి ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. పదవి ఇస్తారా ఇవ్వరా ? అనేది పార్టీ అధిష్టానం ఇష్టం ఇక ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు నా జూనియర్లకు కూడా మంత్రి పదవులు ఇచ్చారు.
ఎవరి కాళ్లో పట్టుకుని తాను మంత్రి పదవి తెచ్చుకోవాలని అనుకోవడం లేదన్నారు. దిగజారి బతకడం నాకు తెలియదు అని .. మళ్లీ త్యాగానికి అయినా సిద్ధం అని .. ఎంత దూరమైన మునుగోడు ప్రజల కోసం వెళతా అని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఏది ఏమైనా రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్లు చూస్తే తెలంగాణలో కాంగ్రెస్లో మరొక్కసారి ముసలం పుట్టేలా కనిపిస్తోంది. అలాగే రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి రూపంలో మరో పెద్ద కష్టం తప్పేలా లేదు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు