
విజయనగరం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం బొబ్బిలి. 2019లో విజయం దక్కించుకున్న వైసీపీ నాయకుడు శంబంగి చిన అప్పలనాయుడును పక్కన పెట్టి.. గత ఏడాది బేబి నాయన ( రంగారావు ) .. విజయం దక్కిం చుకున్నారు. బేబి నాయనకు రాజకీయాలు కొత్త కాదు. ఆయన సోదరుడు.. సుజయ్ కృష్ణ రంగారావు కూడా.. గతంలో రాజకీయాల్లోనే ఉన్నారు. వైసీపీ తరఫున విజయం దక్కించుకున్నారు. తర్వాత.. 2018-19 మధ్య పార్టీ మారారు. దీనికి ముందు కాంగ్రెస్‌లోనూ ఉన్నారు.
సో.. ఇలా చూసుకుంటే.. బేబినాయనకు రాజకీయం కొత్తకాదు. అయితే.. ఆయన తొలిసారి మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ వెంటనే విజయందక్కించుకున్నారు. స్థానికంగా ఉన్న బలంతోపాటు.. వ్యక్తిగ తంగా ఆయన సంపాయించుకున్న ఇమేజ్ కూడా దోహదపడింది. ఇక, స్థానికులను కలుసుకోవడంలో నూ.. వారి సమస్యలు పరిష్కరించడంలోనూ.. బేబినాయన స్టయిలే వేరు. అంతేకాదు.. ఏ సమస్య ఉన్నా.. వెంటనే తన వారిని పంపించి పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తారు.
నియోజకవర్గంలోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ ఎలాంటి రాజకీయాలు ఉన్నాయి? ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయన్నది కూడా బేబినాయనకు కొట్టిన పిండి. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో బేబినాయన ఇంటింటికీ తిరుగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి టీడీపీ ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన ఘనవిజయాలు, అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
సీఎం చంద్రబాబు అనుభవం, పరిపాలనా దక్షత వంటివి రాష్ట్రాన్ని ప్రగతిపథం వైపు దూసుకుపోయేలా తీర్చిదిద్దుతున్నాయని ఆయన చేస్తున్న ప్రచారం టీడీపీ సీనియర్లకు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో ఒకప్పుడు పార్టీలు మారారన్న పేరున్న బేబినాయనకు ఇప్పుడు ఆ పేరు పోయి.. నిఖార్సయిన నాయకుడి గా పేరు తెచ్చుకునేలా చేస్తున్నాయి. మరోవైపు.. వైసీపీ ఊసు పెద్దగా లేకుండా పోవడం కూడా.. బేబినాయ నకు భారీగా కలసి వస్తోంది. ఇలా.. రాజకీయంగా బొబ్బిలిలో బేబినాయన హవా జోరుగా సాగుతుండడం గమనార్హం.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు