- ( ప్ర‌కాశం - ఇండియా హెరాల్డ్ ) . . .

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి రాజ‌కీయం గా తిరుగులేని వాతావరణం కనిపిస్తుంది. 2009 ఎన్నికలలో ఇక్కడి నుంచి తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున శివప్రసాద్ రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికలలో ఓటమి పాలైన శివప్రసాద్ రెడ్డి 2019 ఎన్నికలలో ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అయితే 2024 మాత్రం ప‌ట్టు ప‌ట్టి ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభంజనం అప్రతిహతంగా వీచినా కూడా వైసిపి గెలిచిన 11 సీట్ల లో దర్శి సీటు ఉంది కేవలం. 2400 మెజార్టీతో టిడిపి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మణ్ పై బూచేపల్లి విజయం సాధించారు. వైసిపి అధికారంలోకి వస్తుంది కచ్చితంగా మంత్రి పదవి దక్కించుకోవాలని శివప్రసాద్ రెడ్డి భావించారు.


వైసిపి అధికారంలోకి రాలేదు. అయినా ఆయన ప్రజలకు చేరువ‌ అవుతున్నారు. అయితే ఇక్కడ గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన టిడిపి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి నియోజకవర్గానికి దూరంగా నరసరావుపేటలో ఉంటూ తన వైద్య వృత్తి ని కొనసాగిస్తున్నారు. గొట్టిపాటి లక్ష్మి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న దర్శి నియోజకవర్గం పై పట్టు సాధించలేక పోతున్నారు. ఇక ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌తంలో ప్రాథినిత్యం వ‌హించిన‌ మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు నోరు మెద‌ప‌డం లేదు. ఏది ఏమైనా దర్శి నియోజ‌క‌వ‌ర్గం లో ఎమ్మెల్యేకు ఎదురులేదు. ఆయన చాలా సేఫ్గా ఉన్నారు అని చెప్పాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: