ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈరోజున మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడబోతున్నారు. దీంతో చాలామంది ప్రజలతో పాటు నేతలు కూడా ఎలాంటి విషయాలపైన మాట్లాడతారనే విషయంపై చాలా ఆత్రుతగా ఉన్నారు. తాడేపల్లిలో వైసిపి కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, తాజాగా జరుగుతున్న పరిణామాల పైన వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడబోతున్నట్లు వినిపిస్తున్నాయి.



అలాగే రైతుల సమస్యల పైన ,గిట్టుబాటు ధరలు, అక్రమ అరెస్టుల పైన వీటికితోడు తను పర్యటిస్తున్న ప్రాంతాలపైన ఆంక్షలుతో సహా సహజ రాజకీయ పరిణామాల పైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి మీడియా సమావేశం పెట్టినా కూడా అన్ని లెక్కలతో సహా చూపిస్తూ కూటమి నేతలకు చుక్కలు చూపిస్తున్నారనే విధంగా నేతలు మాట్లాడుకుంటున్నారు. ఈ లెక్కలతో కూటమి నేతలు కూడా సమాధానాలు చెప్పలేని పరిస్థితి ఉందంటూ వైసీపీ శ్రేణులు వెల్లడిస్తున్నారు.


మరి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రెస్మీట్ నేపథ్యంలో ఇప్పుడు సర్వత్ర ఉత్కంఠత నెలకొంది. అలాగే పాదయాత్రకు సంబంధించి విషయాలు.. అలాగే కూటమి ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేసింది, నిరుద్యోగులను ,మహిళలను, రైతులను ఉద్యోగులను ఏ విధంగా మోసం చేశారని విషయాల పైన మాట్లాడే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారన్నట్లుగా రాజకీయ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సూపర్ సిక్స్ హామీలు అంటూ ప్రజలని మోసం చేశారని ఇప్పటికే ఎన్నో సందర్భాలలో అటు వైసీపీ నేతలు కూడా మాట్లాడారు. మరి ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి విషయాలు మాట్లాడుతారో చూడాలి. రాబోయే రోజుల్లో పలువురు కీలకమైన నేతలు కూడా వైసిపి పార్టీలో రాబోతున్నట్లు రాజకీయ వర్గాలను గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: