- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

లిక్కర్స్ స్కామ్ లో సిట్‌ అధికారులు నాడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి నోటీసులు జారీ చేశారు. శనివారం ఆయన సిట్ అధికారుల ముందు హాజరు కానున్నారు. లిక్కర్ స్కాంలో ఇప్పటివరకు నారాయణస్వామి పేరు వినిపించలేదు. ఇప్పుడు కూడా ఆయనకేం సంబంధం లేదు .. కేవలం సాక్షిగా పిలుస్తున్నారు అంతే ..! గ‌త ప్ర‌భుత్వం లో ఎక్సైజ్ మంత్రి ఆయనే .. అయితే అప్ప‌టి ముఖ్య‌మంత్రి జగన్ మోహ‌న్ రెడ్డి అప్పట్లో కొందరు వైసీపీ కీలక ప్రజా ప్రతినిధులు .. అధికారులు నారాయణస్వామికి చిన్న నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది. ఎప్పుడైనా వివాదాలు వచ్చినా ప్రెస్ మీట్ లు పెట్టే ఛాన్స్ కూడా ఉండేది కాదు. అసలు ఆయన పేషీ లో అధికారులు ఎవరున్నారో కూడా నారాయణస్వామికి తెలియదు. చివరికి ఎంత పెద్ద స్కాం జరిగితే అందులో ఆయనకు పిస‌రంత కమీషన్ కూడా ఇవ్వలేదట.


ఆయనకు ఏ రూపంలో అయినా కాస్తంత డబ్బులు ఇచ్చారని సిట్ అధికారులకు ఆధారాలు లభించలేదు. మిథున్ రెడ్డి ప్రతినెల ఐదు కోట్లు తీసుకున్నట్లుగా చెబుతున్నారు .అందులో పైసా కూడా నారాయణస్వామికి ఆదాయం ఇచ్చినట్టు ఆధారాలు లభించలేదు. జగన్ మంత్రివర్గంలో మంత్రులకు ఎలాంటి బాధ్యతలు ఉండేవి కావు. సకల శాఖల మంత్రిగా సజ్జల పనులు చక్కబట్టేవారు. ఆయా శాఖల మంత్రులు కూడా తమ శాఖల గురించి మాట్లాడే వాళ్ళు కాదు. సజ్జల ఆఫీస్ నుంచి వచ్చే ప్రెస్ నోట్లు ఎవరికి వస్తే వారు మాట్లాడేవాళ్లు. పౌరసరఫరాల గురించి పేర్ని నాని , హోంశాఖ గురించి కొడాలి నాని , విద్యాశాఖ గురించి రోజా ఇలా ఎవరికి సంబంధం లేని శాఖల గురించి మాట్లాడేవారు. లక్కీగా తన శాఖలో జగన్ చేసిన అతిపెద్ద స్కాం లో నారాయణస్వామి ఇరుక్కోక పోవటం ఆయన అదృష్టం అనుకోవాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: