ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మద్యం కుంభకోణంపై తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. ఈ కుంభకోణం ఒక ఆర్థిక నేరంగా పేర్కొంటూ, దీని వెనుక ఉన్న కుట్రలను పూర్తిగా వెలికితీయాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు మద్యం అమ్మకాలను నగదుతోనే నిర్వహించడం, డిజిటల్ చెల్లింపులను నిలిపివేయడం ద్వారా బ్లాక్ మనీని ప్రోత్సహించిందని ఆరోపించారు. ఈ విధానం పన్నులను ఎగ్గొట్టేందుకే అమలు చేసినట్లు షర్మిల విమర్శించారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఈ విషయంలో ప్రజలకు సూటిగా సమాధానం చెప్పాలని ఆమె సవాలు విసిరారు.ఈ కుంభకోణం కేవలం రూ.3,500 కోట్ల విలువైనది కాదని, దీని వెనుక భారీ ఆర్థిక అవకతవకలు దాగి ఉన్నాయని షర్మిల ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం బ్రాండెడ్ మద్యాన్ని నిలిపివేసి, నాసిరకం, చౌక మద్యాన్ని ప్రోత్సహించినట్లు ఆమె తెలిపారు. ఈ చర్యల వల్ల నాన్-డ్యూటీ పేమెంట్లు బ్లాక్ మనీగా మారాయని, దీనిపై సమగ్ర విచారణ జరగాలని ఆమె పట్టుబట్టారు.

ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు కోణాలను బయటపెట్టడానికి సిట్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేయాలని ఆమె కోరారు.ఈ మద్యం కుంభకోణం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో 30 లక్షల మంది కిడ్నీ సమస్యలతో బాధపడ్డారని, 30 వేల మందికి పైగా నాసిరకం మద్యం వల్ల మరణించారని ఆమె ఆరోపించారు.

కోట్లాది మంది జనాభా ఏదో ఒక రూపంలో అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ చర్యలు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టాయని, దీనిపై బాధ్యులు జవాబుదారీగా ఉండాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కుంభకోణం ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: