
అయితే ఈ వ్యవహారంపై వంగవీటి రాధ వెంటనే స్పందించి.. అక్కడికి వెళ్లి సావిగ్రహాలను శుద్ధి చేయడం, అక్కడ కొన్ని కార్యక్రమాలలో పాల్గొనడం వంటివి చేశారు. ఇక పదవుల గురించి మాట్లాడుతూ తాను పెద్దగా పదవుల మీద ఆలోచించనని.. రంగా గారి కుమారుడే అన్నటువంటిదే తనకు చాలా పెద్ద పదవి అంటూ తెలిపారు. అయితే అదృష్టవశాత్తు అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచారు. అది కూడా 25 ఏళ్ల వయసులోనే అయ్యారు రాధా .అప్పటినుంచి ఇప్పటివరకు మళ్ళీ ఎమ్మెల్యేగా కాలేకపోయారు.
ప్రజారాజ్యం ,పార్టీ వైసీపీ పార్టీ, టిడిపి పార్టీ చేరారు.. గత ఎన్నికలలో ప్రయత్నించిన సీటు దక్కలేదు. ప్రస్తుతం టిడిపి పార్టీలోనే ఉన్నారు.. అయితే గత కొద్దిరోజులుగా ఎమ్మెల్సీ పదవి ఇస్తామనే మాట వినిపిస్తూ ఉన్నది. కాని ఇచ్చేలా కనిపించడం లేదట.. కాని వినిపిస్తున్న వార్తల ప్రకారం ఎన్నికలకు ఒక ఏడాది ముందు వంగవీటి రాధా కి పదవి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అది కూడా మండలాలలో కోట కింద వంగవీటి రాధాకు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదట.ఇలా చేయడం వల్ల వచ్చే ఎన్నికలకు కూడా చాలా ఉపయోగపడుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు వినిపిస్తున్నాయి. అది కూడా చాలా కీలకమైన పదవి ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఎలాంటి పదవి ఇస్తారో చూడాలి.